Web Series | బంగారం అక్రమ రవాణాపై వెబ్ సిరీస్ – లీడ్ రోల్‌లో ఓజీ విలన్ – టైటిల్ ఇదే
బంగారం అక్రమ రవాణా బ్యాక్‌డ్రాప్‌లో తస్కరీ పేరుతో హిందీలో ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ వెబ్‌సిరీస్ జనవరి 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Dec 17, 2025, 6.15 pm IST
ఇమ్రాన్ హష్మీ
Web Series | కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయిన సంఘటన అప్పట్లో సినీ పరిశ్రమను కుదిపేసింది. రన్యారావుతో పాటు చాలా మంది సినీ ప్రముఖులకు ఈ గోల్డ్ స్మగ్లింగ్‌తో సంబంధాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. టూర్ల పేరుతో విదేశాలకు వెళుతున్న సెలబ్రిటీస్ బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు పుకార్లు షికారు చేశాయి. సెలబ్రిటీస్ బంగారం అక్రమ రవాణా కథతో ఓ వెబ్‌సిరీస్ (Web Series) రాబోతుంది. తస్కరీ ది స్మగ్లర్స్ వెబ్ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో బాలీవుడ్ సీనియర్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తస్కరీ వెబ్‌సిరీస్‌కు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీరజ్ పాండే స్టోరీని అందించడమే కాకుండా క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రాఘవ్ జైరత్ దర్శకత్వం వహిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్...
తస్కరీ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 14న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రిలీజ్ కానుంది. తస్కరీ టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు మేకర్స్.
తస్కరీ టీజర్ గ్రిప్పింగ్‌గా సాగింది. ఎయిర్‌పోర్ట్ సీన్స్‌తోనే ఈ టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత బంగారం అక్రమ రవాణా కోసం స్మగ్మర్స్ వేసే ప్లాన్స్ చూపించారు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు దొరక్కుండా బంగారాన్ని సీక్రెట్‌లా ఎలా దాచిపెడతారన్నది టీజర్‌లో కనిపించింది. ఆ తర్వాత అర్జున్ మీనా అనే కస్టమ్స్ ఆఫీసర్‌గా ఇమ్రాన్ హష్మీ టీజర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను అతడు ఎలా అడ్డుకున్నాడు? బంగారం రవాణా వెనకున్న వారిని బడాబాబులను ఎలా పట్టుకున్నాడనే అంశాలతో టీజర్ ఆకట్టుకుంది.
తస్కరీ వెబ్‌సిరీస్‌లో ఇమ్రాన్ హష్మీతో పాటు శరద్ ఖేల్కర్, అమృత కన్విల్కర్, నాదిష్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తస్కరీ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. గతంలో నీరజ్ పాండే స్పెషల్ ఓప్స్, ఖాకీ బీహార్ ఛాప్టర్, బెంగాల్ ఛాప్టర్ వెబ్ సిరీస్‌లకు క్రియేటర్‌గా వ్యవహరించాడు. క్రైమ్ థ్రిల్లర్స్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను మెప్పించాయి.పవన్ కళ్యాణ్ ఓజీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇమ్రాన్ హష్మీ. ఈ గ్యాంగ్‌స్టర్ మూవీలో విలన్ పాత్రలో నటించాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



