Akshaye khanna | బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా చిక్కుల్లో పడ్డారు. ఈ సీనియర్ హీరోకు దృశ్యం 3 నిర్మాత కుమార్ మంగత్ పాథక్ లీగల్ నోటీసులు పంపించారు . దృశ్యం 3 కోసం ఎక్కువ రెమ్యూనరేషన్‌ను అక్షయ్ ఖన్నా డిమాండ్ చేయడమే ఈ వివాదానికి కారణమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రిలీజైన ధురంధర్ మూవీలో అక్షయ్ ఖన్నా విలన్‌గా కనిపించాడు. ఆదిత్య ధర్ దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రెహమాన్ బలోచ్ అనే క్యారెక్టర్‌లో అక్షయ్ ఖన్నా తన విలనిజంతో అదరగొట్టారు. యాక్టింగ్‌లో హీరో రణవీర్‌సింగ్‌ను చాలా చోట్ల డామినేట్ చేశాడు. ఈ సినిమాకు నిజమైన హీరో అక్షయ్ ఖన్నానే అంటూ ఫ్యాన్స్ కూడా ఈ సీనియర్ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ధురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ధురంధర్ మూవీతో అక్షయ్ ఖన్నా బాలీవుడ్‌లో బిజీగా మారిపోయాడు. అగ్ర దర్శకుల సినిమాల నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి ధురంధర్ బ్లాక్‌బస్టర్‌తో అక్షయ్ ఖన్నా తన రెమ్యూనరేషన్‌ను పదింతలు పెంచేశాడట. ధురంధర్ మూవీలో విలన్ పాత్ర కోసం కేవలం రెండు కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్న అక్షయ్ ఖన్నా ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దృశ్యం 3... అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్న దృశ్యం 3 సినిమాలో అక్షయ్ ఖన్నా విలన్‌గా నటించాల్సివుంది. దృశ్యం ఫ్రాంచైజ్‌లో భాగంగా వస్తోన్న మూడో పార్ట్ షూటింగ్ ను జనవరిలో మొదలుపెట్టేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్‌కు ముందు అనూహ్యంగా అక్షయ్ ఖన్నా ఈ సినిమా నుంచి తప్పుకోవడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం అక్షయ్ ఖన్నా 21 కోట్ల రెమ్యూనరేషన్ అడిగాడట. నిర్మాతలు అందుకు ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తోంది.దాంతో దృశ్యం 3 తాను నటించడం లేదంటూ నిర్మాతకు అక్షయ్ మెసేజ్ పెట్టి పెద్ద షాకిచ్చాడట. ఈ విషయాన్ని నిర్మాత స్వయంగా వెల్లడించాడు. దృశ్యం 3 నటించడానికి అంగీకరిస్తూ అక్షయ్ ఖన్నా అగ్రిమెంట్స్‌పై సైన్ పెట్టాడు. అతడికి అడ్వాన్స్‌గా కొంత డబ్బు ఇచ్చాము. ధురంధర్ హిట్టవ్వగానే మాట మార్చేశాడంటూ నిర్మాత కుమార్ మంగత్ పాథక్ ఈ సీనియర్ హీరోపై ఫైర్ అయ్యారు. ధురంధర్ తన వల్లే హిట్టయ్యకిందనే భ్రమలో అక్షయ్ ఉన్నాడని, అతడికి లీగల్ నోటీసులు పంపించామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విగ్గు కూడా కారణమా? ధురంధర్‌లో విగ్గు పెట్టుకొని అక్షయ్ ఖన్నా కనిపించారు. సెంటిమెంట్ కలిసిరావడంతో ఈ విగ్గును దృశ్యం 3లో కంటిన్యూ చేస్తానని నిర్మాతకు అక్షయ్ ఖన్నా కండీషన్ పెట్టాడట. దృశ్యం, దృశ్యం 2లో అక్షయ్ ఖన్నా విగ్గు లేకుండా నటించడంతో నిర్మాతలు అతడి కండీషన్‌కు ఒప్పుకోలేదని అంటున్నారు. లుక్ మారితే ఆ ఇంపాక్ట్ కథపై ఉంటుందని వద్దన్నారట. ఈ విభేదాలవల్లే దృశ్యం 3 నుంచి అక్షయ్ ఖన్నా వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోంది.