త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eiffel Tower Lightning | ఈఫిల్ టవర్‌పై భారీ పిడుగు.. క్షణాల్లో మారిన వాతావరణం.. VIDEO

ఫ్రాన్స్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఒకే ఒక్క పిడుగు బ్రేక్ వేసింది. పారిస్‌లో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం, ఉరుముల వీడియో ఇదే.

J

Viral news | Published On Jun 28, 2026, 3.22 pm IST

Eiffel Tower Lightning | ఈఫిల్ టవర్‌పై భారీ పిడుగు.. క్షణాల్లో మారిన వాతావరణం.. VIDEO
Advertisement
  • ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయి ఎండలకు బ్రేక్ వేస్తూ పారిస్‌లో భారీ థండర్‌స్ట్రోమ్ (Thunderstorm)
  • ఈఫిల్ టవర్ వెనుక మెరిసిన భారీ పిడుగును కెమెరాలో బంధించి, షేర్ చేసిన అమెరికన్ ఫోటోగ్రాఫర్
  • నిమిషాల వ్యవధిలోనే ఉక్కపోత నుంచి కూల్ వెదర్‌కు మారడంతో ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
  • భారీ ఈదురు గాలులు, వరదల ముప్పుతో ఆరెంజ్ అలర్ట్ (Orange alert) జారీ చేసిన వాతావరణ శాఖ

Eiffel Tower Lightning | త్రినేత్ర.న్యూస్ : పారిస్ అనగానే ఆహ్లాదకరమైన వాతావరణం గుర్తొస్తుంది. కానీ గత కొన్ని రోజులుగా అక్కడ రికార్డు స్థాయి ఎండలతో (Heatwave) జనం అల్లాడిపోయారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పారిస్‌లోని ప్రతిష్టాత్మక ఈఫిల్ టవర్ (Eiffel Tower) పై పడిన ఓ భారీ పిడుగు ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడి రోజులకు సడెన్ ఎండ్ కార్డ్ వేసింది.

వైరల్ అవుతున్న ఎపిక్ వీడియో

అమెరికాకు చెందిన ఫోటోగ్రాఫర్ క్రిస్టల్ కెన్నీ (Krystal Kenney) ఈ అద్భుతమైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఈఫిల్ టవర్ వెనుక వరుసగా మెరిసిన ఉరుములు, పిడుగులకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

"ఈఫిల్ టవర్‌పై ఒక్క పిడుగు.. నిమిషాల్లోనే హీట్‌వేవ్ మాయమైంది. నేను పారిస్‌లో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాను, కానీ ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. ఈ తుఫానును మీలో ఎవరైనా చూశారా?" అని ఆమె రాసుకొచ్చారు.

నెటిజన్ల రియాక్షన్స్

ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ (Viral) అవుతోంది. ఉక్కపోతతో అల్లాడిపోయిన పారిస్ వాసులు ఈ సడెన్ చేంజ్ చూసి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "ఒక్క నిమిషం క్రితం తీవ్రమైన ఉక్కపోత, తర్వాత ఉరుములు.. ఆ వెంటనే ఎంతో హాయినిచ్చే కూల్ వాతావరణం.. అమేజింగ్!" అని ఒకరు కామెంట్ చేశారు.

"ఇది అచ్చం టెక్సాస్ వెదర్‌లా ఉంది. కొన్ని రోజులు విపరీతమైన ఎండ, ఆ తర్వాత ఉరుములతో వర్షం, మరుసటి క్షణమే బ్లూ స్కై" అని పారిస్‌లో ఉంటున్న మరో టెక్సాస్ వాసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "నేను పారిస్ శివార్లలో ఉంటాను. దాదాపు గంటపాటు ఈ వాతావరణం ఉంది. ఒక దశలో కొంచెం భయం కూడా వేసింది" అని మరొక యూజర్ కామెంట్ చేశారు.

ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ఈ భారీ వర్షంతో పారిస్ వాసులకు ఎండల నుంచి ఉపశమనం లభించినప్పటికీ, ఫ్రెంచ్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ (Orange alert) జారీ చేసింది. భారీ వడగళ్లు, ఈదురు గాలులు, ఆకస్మిక వరదలు (Flash floods) వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తాత్కాలిక భవనాలు, చెట్ల కింద ఉండటం ప్రమాదకరమని హెచ్చరించింది. ప్రజలు అనవసరంగా రాత్రి పూట ప్రయాణాలు చేయొద్దని, అఫీషియల్ వెదర్ అప్‌డేట్స్ (Weather updates) గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.

గత వారం రోజులుగా ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోయాయి. దేశ సగటు ఉష్ణోగ్రత 24 గంటల పాటు 30 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదు కాగా, కొన్ని ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలకు చేరుకుంది. ఎట్టకేలకు ఈ ఆకస్మిక వర్షం పారిస్ వాసులకు ఊరటనిచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Krystal Kenney (@missparisphoto)

Advertisement
Advertisement