CEC Sudarshan Reddy | బీఎల్‌వోలకు డమ్మీ ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వండి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి
CEC Sudarshan Reddy | SIR-2026 ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఫారాలు నింపడంలో సులభతరం చేసేందుకు బీఎల్‌వో (BLO) లకు 5 నుంచి 10 డమ్మీ ఎన్యుమరేషన్ ఫారాలను అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుధర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
CEC Sudarshan Reddy | త్రినేత్ర.న్యూస్: SIR-2026 ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఫారాలు నింపడంలో సులభతరం చేసేందుకు బీఎల్‌వో (BLO) లకు 5 నుంచి 10 డమ్మీ ఎన్యుమరేషన్ ఫారాలను అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుధర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలో తెలుగు వెర్షన్ డమ్మీ ఫారాలు, మిగతా జిల్లాల్లో ఆంగ్ల వెర్షన్ ఫారాలు పంపిణీ చేయాలని సూచించారు.
ఓటర్లు తమకు నచ్చిన విధంగా తెలుగు లేదా ఆంగ్లంలో ఫారాలు నింపేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో ఎటువంటి ఇబ్బందులు కలగొద్దన్నారు. అందుకోసం బూత్ లెవల్ ఆఫీసర్లు తమ వద్ద డమ్మీ ఫారాలను అందుబాటులో ఉంచుకోవాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
కాగా ఈనెల 25 నుండి జూలై 24 వరకు ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ప్రతి ఓటరుకు ముందస్తు వివరాలతో (పేరు, ఫోటో, ఈపిక్ నంబర్ మొదలైనవి) కూడిన రెండు ప్రీ-ప్రింటెడ్ ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారు. ఇందులో ఒక ఫారం సమర్పించాల్సి ఉంటుంది. రెండోది రసీదుగా ఓటరు వద్దే భద్రపరచుకోవాలి. ఓటర్లు ఫారాలు నింపేటప్పుడు ఏవైనా తప్పులు చేయకుండా BLOలు తమ వద్ద ఉన్న డమ్మీ ఫారాలను ఉపయోగించి ఎలా నింపాలో అవగాహన కల్పిస్తారు.
తాజావార్తలు
- ●KTR | 12 లక్షల చెట్లు నరికేసి.. వికారాబాద్ అడవులకు ఉరి వేసే ప్రయత్నం : కేటీఆర్
- ●Muharram Procession Poison | కనీసం 15 వేల మందిని చంపాలనుకున్నా.. ముంబై పోలీసులకు చెప్పిన నిందితుడు
- ●Harish Rao | రేవంత్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ?
- ●Green India Challenge | ప్రతి డాట్ బాల్‌కు మొక్కలు .. తెలంగాణ క్రికెట్లో కొత్త అధ్యాయం
- ●Rangareddy | వికలాంగుడే కానీ.. కూరగాయలు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతూ..
- ●Venezuela | భూకంపంలో భార్యను కోల్పోయిన ఫుట్‌బాలర్.. కూతురి కోసం ప్రాణత్యాగం చేసిన తల్లి..!

KTR | 12 లక్షల చెట్లు నరికేసి.. వికారాబాద్ అడవులకు ఉరి వేసే ప్రయత్నం : కేటీఆర్

Muharram Procession Poison | కనీసం 15 వేల మందిని చంపాలనుకున్నా.. ముంబై పోలీసులకు చెప్పిన నిందితుడు

Harish Rao | రేవంత్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ?

Green India Challenge | ప్రతి డాట్ బాల్‌కు మొక్కలు .. తెలంగాణ క్రికెట్లో కొత్త అధ్యాయం




