Disha Patani | బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానిపై ట్రోల్.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Disha Patani | బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఓ వైపు సినిమాలు.. మరో వైపు హాట్ ఫొటో షూట్లతో సెగలు పుట్టిస్తుంది. ఈ బ్యూటీ ఇటీవల ల్మాకే ఫ్యాషన్ వీక్ 2026లో పాల్గొంది. ఈ ఈవెంట్‌లో ఆమె ధరించిన డ్రెస్, ముఖ్యంగా స్టేజ్‌పై ఆమె దుస్తులను సర్దుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Entertainment | Published On Mar 25, 2026, 3.50 pm IST
Disha Patani | బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఓ వైపు సినిమాలు.. మరో వైపు హాట్ ఫొటో షూట్లతో సెగలు పుట్టిస్తుంది. ఈ బ్యూటీ ఇటీవల ల్మాకే ఫ్యాషన్ వీక్ 2026లో పాల్గొంది. ఈ ఈవెంట్‌లో ఆమె ధరించిన డ్రెస్, ముఖ్యంగా స్టేజ్‌పై ఆమె దుస్తులను సర్దుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇదంతా స్పాట్‌లైట్‌లో ఉండేందుకు మాత్రమేనని వ్యాఖ్యానించారు. పలువురు యాక్టింగ్ స్కిల్స్‌పై విమర్శలు గుప్పిస్తారు. అయితే, మరోవైపు దిశ పలువురు మద్దతుగా నిలుస్తున్నారు.
Meet Disha Patani
>Zero Talent
>Minimum screentime
>Revealing clothes to stay relevant 🤡If you have to adjust your clothes like this, then it is not elegant it is Cringe. pic.twitter.com/nCCwVnCLMk
— Chota Don (@choga_don) March 22, 2026
ఒకే ఒక్క పబ్లిక్ అపియరెన్స్ ఆధారంగా మొత్తం కెరీర్‌ను అంచనా వేయడం సరైంది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. పబ్లిక్ ఫిగర్స్‌పై చర్చలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత స్థాయికి వెళ్లే విమర్శలు సముచితం కాదని పేర్కొంటున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత బాలీవుడ్‌లో ఒక సెలబ్రిటీ గుర్తింపు అనేది కేవలం నటనతోనే పరిమితం కాదు. బ్రాండింగ్, సోషల్ మీడియా ప్రెజెన్స్, ఫ్యాషన్ సెన్స్ అన్నీ కలిసి ఒక సెలబ్రిటీ ఇమేజ్‌ను నిర్మిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాషన్ ఆప్షన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని ఫ్యాషన్ ఆప్షన్స్‌పై సమంజసమైన చర్చ అవసరమనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అసౌకర్యంగా ఉండే దుస్తులు పబ్లిక్ ఈవెంట్లలో అసహజ పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటివి ప్రేక్షకుల దృష్టిని త్వరగా ఆకర్షించడం కంటే విమర్శలే వస్తాయని పేర్కొంటున్నారు.
Disha Patani is trying to cover herself, so why is she wearing such clothes in the first place? pic.twitter.com/DbG6UnEVUJ
— Aditya (@Warlock_Aditya) March 22, 2026
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, హీరోలతో పోలిస్తే హీరోయిన్ల దుస్తుల విషయంలో విమర్శలు రావడం ప్రేక్షకుల్లో అసమానతను స్పష్టంగా చూపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజా జీవితంలో విమర్శలు అనివార్యం. అయితే అవి పరిమితిని దాటి వ్యక్తిగతంగా మారకుండా, ఒక వ్యక్తి ప్రతిభ లేదా విలువను తగ్గించేలా కాకుండా సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా దిశా సినిమాల విషయానికి వస్తే చివరి సారిగా ఓ రోమియో మూవీలో నటించింది. ప్రస్తుతం హోలీగార్డ్ సాగా అనే ఇంగ్లిష్ మూవీలో నటిస్తోంది. హిందీలో అవారాపన్-2, వెల్ కం టూ ద జంగిల్ మూవీలో నటిస్తోంది.
When you have 0 talent you have to wear such revealing clothes to stay in the limelight and Disha Patani is a perfect example of that. pic.twitter.com/BFFpxaWHo0
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) March 21, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



