Movie Director | ఒకే ఏడాది 16 సినిమాలకు దర్శకత్వం – నలభై ఏళ్లయిన బ్రేక్ కానీ కోలీవుడ్ డైరెక్టర్ రేర్ రికార్డ్
ఒకే ఇయర్‌లో తమిళ డైరెక్టర్ రామనారాయణ ఏకంగా పదహారు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ రికార్డు నెలకొల్పి 40 ఏళ్లయిన ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.
Entertainment | Published On Feb 2, 2026, 5.16 pm IST
Movie Director | ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాను పూర్తిచేయడానికి స్టార్ డైరెక్టర్లు ఏడాది, రెండేళ్లపైనే టైమ్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి సినిమా పూర్తికావాలంటే కనీసం నాలుగైదేళ్లు ఎదురుచూడాల్సిందే. ఎడాదిలో ఒక్క సినిమా పూర్తిచేయడమే ఇప్పుడు గొప్పగా మారింది. ఓ డైరెక్టర్ ఓ ఇయర్‌లో రెండు, మూడు సినిమాలు చేస్తే అతడి గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి నెలకొంది.
కానీ కోలీవుడ్ డైరెక్టర్ రామనారాయణ ఒకే ఏడాది ఏకంగా పదహారు సినిమాలు చేశాడు. ఈ రికార్డును అతడు నెలకొల్పి నలభై ఏళ్లయినా ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
మూడు తెలుగు సినిమాలు...
భక్తి సినిమాలకు సుప్రసిద్దుడిగా పేరు తెచ్చుకున్న రామనారాయణ 1985 ఏడాదిలో మొత్తం పదహారు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో పదమూడు తమిళ సినిమాలతో పాటు ఓ మూడు సినిమా కూడా ఉండటం గమనార్హం.
దయ్యాల మేడ...
1985లో రామనారాయణ దర్శకత్వం వహించిన వీరన్, కుట్రవాలిగల్, చైన్ జయపాల్, ఇల్లామై, తందానై, సిగప్పు నిల, ఉరిమై, రగస్యంతో పాటు మరికొన్ని తమిళ సినిమాలు విడుదలయ్యాయి. అదే ఏడాది దయ్యాల మేడ, ఇన్స్‌పెక్టర్ లక్ష్మి, చిలిపి యవ్వనం పేరుతో మూడు తెలుగు సినిమాలు చేశారు రామనారాయణ. మొత్తంగా ఆ ఏడాది రామనారాయణ దర్శకత్వం వహించిన 16 సినిమాలు రిలీజయ్యాయి. ఇందులో చాలా సినిమాలు విజయాలను సాధించడం గమనార్హం.
శశి కుమార్...15 సినిమాలు...
అంతకుముందు ఏడాది 1984లో రామనారాయణ దర్శకత్వంలో వహించిన 12సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రెండేళ్లలోనే డైరెక్టర్‌గా మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు చేశారు రామనారాయణ. ఆయన కంటే ముందు ఒకే ఏడాది హయ్యెస్ట్ సినిమాలు చేసిన రికార్డు మలయాళ డైరెక్టర్ జే శశికుమార్ పేరిట ఉంది. 1977లో జే శశికుమార్ దర్శకత్వం వహించిన 15 సినిమాలకు రిలీజయ్యాయి.
తెలుగులో దాసరి...
తెలుగులో ఒకే ఇయర్‌లో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన రికార్డు దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు పేరిట ఉంది. 1980లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 14 సినిమాలు రిలీజయ్యాయి.
వీటిలో సర్ధార్ పాపారాయుడు, ఏడంతస్తుల మేడ, కేటుగాడు, విశ్వరూపం, దీపారాధన, శ్రీవారి ముచ్చట్లు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Janhvi Kapoor | కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న జాన్వీ కపూర్ – స్టార్ హీరో తనయుడికి జోడీగా
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



