త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ilaiyaraaja | శివ‌, సాగ‌ర సంగ‌మం, దళపతి పాట‌లు వాడొద్దు – ఇళ‌య‌రాజాకు కోర్టు ఆదేశాలు

దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఇళ‌య‌రాజా సంగీతం అందించిన 134 సినిమాల్లోని పాట‌ల‌ను ఈ లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కూడా ఉప‌యోగించ‌డానికి వీలులేద‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది.

N

Entertainment | Published On Feb 17, 2026, 4.38 pm IST

Ilaiyaraaja | శివ‌, సాగ‌ర సంగ‌మం, దళపతి పాట‌లు వాడొద్దు – ఇళ‌య‌రాజాకు కోర్టు ఆదేశాలు
Advertisement

Ilaiyaraaja | ఇదివ‌ర‌కు ఇళ‌య‌రాజా పేరు వింటే ఎవ‌ర్‌గ్రీన్ సాంగ్స్‌ గుర్తొచ్చేవి. ఇప్పుడు మాత్రం ఆయ‌న పేరు వింటే కాపీరైట్ ఉల్లంఘ‌న కేసులే ఎక్కువ‌గా గుర్తొస్తున్నాయి. తాను కంపోజ్ చేసిన పాట‌లు వాడిన సినిమాల‌పై కాపీరైట్ ఉల్లంఘ‌న కేసులు వేస్తూ వ‌చ్చారు ఇళ‌య‌రాజా. ఆయ‌న పాట వాడాలంటేనే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. ఇటీవ‌ల రిలీజైన ఓ తెలుగు సినిమాలో ఇళ‌య‌రాజా కాపీరైట్ కేసుల వ్య‌వ‌హారాన్ని ఓ జోక్‌గా వాడుకునే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది.

కూలీ, మంజుమ్మ‌ల్ బాయ్స్‌...

మంజుమ్మ‌ల్ బాయ్స్‌, గుడ్ బ్యాడ్ అగ్లీ, కూలీతో పాటు ప‌లు సినిమాల‌పై ఇళ‌య‌రాజా కేసులు వేశారు. అనుమ‌తి లేకుండా త‌న సినిమాల పాట‌లు వాడ‌ద్దంటూ హెచ్చ‌రిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా కాన్సెర్ట్‌లు, టీవీ షోల‌తో పాటు ఇత‌ర ఈవెంట్ల‌లోనే ఇదే రూల్ ఫాలో కావాల‌ని డిమాండ్ పెడుతున్నారు ఇళ‌య‌రాజా. ఒక‌వేళ పాట‌లు వాడాల‌నుకుంటే ఇళ‌య‌రాజా అనుమ‌తి తీసుకోవ‌డ‌మే కాకుండా రాయ‌ల్టీగా కొంత మొత్తం చెల్లించాల్సిఉంటుంద‌ని కండీష‌న్లు పెడుతూ వ‌చ్చాడు.

ఇళ‌య‌రాజాకు షాక్‌...

తాజాగా ఇళ‌య‌రాజాకే ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. తాను కంపోజ్ చేసిన పాట‌ల‌నే ఇళ‌య‌రాజానే వాడొద్దంటూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. శివ‌, స్వాతిముత్యం, సాగ‌ర సంగ‌మం, నాయ‌కుడు, ద‌ళ‌ప‌తితో పాటు... 1976 నుంచి 2001 మ‌ధ్య‌కాలంలో తాను మ్యూజిక్ అందించిన‌ 134 సినిమాల్లోని పాట‌లకు సంబంధించిన స‌ర్వ‌ హ‌క్కులు త‌న‌వే అంటూ ఇళ‌య‌రాజా ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌, ఐట్యూన్స్ వంటి సంస్థ‌ల‌కు అమ్మారు. ఆయా సినిమాల నిర్మాత‌లు ఆ 134 సినిమాల మ్యూజిక్ రైట్స్‌ను స‌రిగ‌మ‌ సంస్థ‌కు ఇచ్చేశారు. దాంతో ఇళ‌య‌రాజాపై స‌రిగ‌మ‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ సినిమాల పాట‌ల‌పై స‌రిగ‌మ‌పకే హ‌క్కులు ఉన్నాయ‌ని, ఈ కేసులో తుది తీర్పు వ‌చ్చే వ‌ర‌కు ఈ 134 సినిమాల్లోని పాట‌ల‌ను ఇళ‌య‌రాజా కూడా వాడ‌టానికి వీలులేద‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

 

నిర్మాతలవే హక్కులు...

ఇళ‌య‌రాజా సంగీతం అందించే సినిమాల‌తో పాటు ఆయ‌న కాన్సెర్ట్‌ల‌లో కూడా ఈ పాట‌లు వాడ‌టానికి వీలులేద‌ని తెలిపింది. సినిమాల‌కు మ్యూజిక్ అందించినందుకు ఇళ‌య‌రాజా నిర్మాత‌ల నుంచి రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నాడు కాబ‌ట్టి...ఆ సినిమాల్లోని పాట‌ల హ‌క్కులు నిర్మాత‌ల‌కే ఉంటాయ‌ని తెలిపింది. వాటిని నిర్మాత ఎవ‌రికైనా విక్ర‌యించే హ‌క్కు ఉంద‌ని కోర్టు తెలిపింది. ఈ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌పై నెల రోజుల్లోపు స్పందించాల్సిందిగా ఇళ‌య‌రాజాను ఆదేశించింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ ఏప్రిల్ 2న జ‌రుగ‌నుంది.

Advertisement
Advertisement