త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jr Ntr | ఎన్టీఆర్ పేరు, ఫొటోలు వాడితే క‌ఠిన చ‌ర్య‌లు – ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

హీరో ఎన్టీఆర్ పేరు, ఫోటోల‌ను అనుమతి లేకుండా వాణిజ్య పరమైన ప్రయోజనాల కోసం వాడ‌టం చ‌ట్ట‌విరుద్ద‌మ‌ని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న‌ది. ట్రోల‌ర్స్ కూడా ఎన్టీఆర్ ఇమేజ్‌ల‌ను వాడ‌కూడ‌ద‌ని ఆదేశించింది

N

Entertainment | Published On Jan 29, 2026, 3.09 pm IST

Jr Ntr | ఎన్టీఆర్ పేరు, ఫొటోలు వాడితే క‌ఠిన చ‌ర్య‌లు – ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
Advertisement

Jr Ntr |  టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య పరమైన ప్రయోజనాల కోసం వాడ‌టం చ‌ట్ట‌విరుద్ద‌మ‌ని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న‌ది. ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ గురువారం ఆదేశాల‌ను జారీ చేసింది . ఇక నుండి “ఎన్‌టీఆర్”, “జూనియర్ ఎన్‌టీఆర్”, “తారక్” తో పాటు “యంగ్ టైగర్”, “మ్యాన్ ఆఫ్ మాసెస్” వంటి ట్యాగ్‌లు , ఆయన ఫోటోలు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాడొద్ద‌ని ఆదేశించింది. ఇదివ‌ర‌కే ఎక్క‌డైనా అనధికారంగా వాడితే వాటిని వెంట‌నే తొల‌గించాల‌ని అన్న‌ది. సోష‌ల్ మీడియాతో పాటు వివిధ మాధ్య‌మాల్లో తన పేరు, ఫోటోల‌ను అనుమతి లేకుండా క‌మ‌ర్షియ‌ల్ ప‌ర్ప‌స్ కోసం వాడుతున్నార‌ని ఎన్టీఆర్ ఇటీవ‌ల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిచారు. ఆయ‌న పిటీష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన కోర్టు గురువారం ఎన్టీఆర్‌కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.

ట్రోలర్స్ వాడొద్దు...

ఎన్టీఆర్‌ పేరు, ఇమేజ్ మీద పూర్తి హక్కులు ఆయనకే ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది.ఫేస్‌బుక్, యూట్యూబ్ తో పాటు మ‌రికొన్ని సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు కోర్టు షాకిచ్చింది. ఎన్టీఆర్‌ పిటిషన్‌ను 2021 ఐటీ రూల్స్ కింద అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, చట్టపరంగా హక్కుల ఉల్లంఘనకు పాల్ప‌డిన‌ లింక్‌లను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని కోర్టు తెలియ‌జేసింది ఆన్‌లైన్‌ ట్రోల్స్ చేసేవాళ్లు కూడా ఎన్టీఆర్ పేరు, ఫోటో మార్పింగ్ చేయ‌డం, ఏఐ కంటెంట్ లేదా ఏదైనా టెక్నాలజీ ద్వారా దుర్వినియోగం చేయ కూడ‌ద‌ని అన్న‌ది. ఎన్టీఆర్ పేరు , ప్రతిష్ఠకు నష్టం క‌లిగించేలా ప్ర‌వ‌రిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని కోర్టు త‌న ఆదేశాల్లో స్ప‌ష్టంగా పేర్కొంది.
ఇటీవ‌ల ఎన్టీఆర్‌తో పాటు చిరంజీవి, నాగార్జున‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు మ‌రికొంద‌రు టాలీవుడ్ హీరోలు కూడా వ్య‌క్తిత్వ హ‌క్కులకు ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు.

డ్రాగ‌న్‌...దేవ‌ర 2

కాగా ప్ర‌స్తుతం ఎన్టీఆర్ డ్రాగ‌న్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. హై ఇంటెన్స్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డ్రాగ‌న్ త‌ర్వాత కొర‌టాల శివ‌తో దేవ‌ర 2 సినిమా చేయ‌బోతున్నారు ఎన్టీఆర్‌.

Advertisement

తాజావార్తలు

Advertisement