Daggubati Family Case | దగ్గుబాటి ఫ్యామిలీ కేసు – పుకార్లను నమ్మద్దంటూ లీగల్ టీమ్ క్లారిటీ
దక్కన్ కిచెన్ కేసులో దగ్గుబాటి హీరోలపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ పుకార్లను దగ్గుబాటి ఫ్యామిలీ లీగల్ టీమ్ ఖండించింది. ఈ కేసులో అవన్నీ ప్రత్యర్థులు చేస్తోన్న తప్పుడు ప్రచారాలని పేర్కొన్నారు.
Entertainment | Published On Mar 26, 2026, 4.34 pm IST
Daggubati Family Case | దక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి హీరోలకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసినట్లు వస్తోన్న వార్తలను వారి లీగల్ టీమ్ ఖండించింది. ప్రత్యర్థులు చేస్తోన్న అసత్య ప్రచారాలను నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చారు.
దక్కన్ కిచెన్ కూల్చివేతకు సంబంధించి నందకుమార్ అనే వ్యక్తికి, దగ్గుబాటి కుటుంబసభ్యులకు మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. దక్కన్ కిచెన్‌ను సురేష్‌బాబుతో పాటు అతడి కుటుంబసభ్యులు అక్రమంగా కూల్చేశారంటూ నందకుమార్ కేసు పెట్టారు.
వ్యక్తిగత హాజరు....
తాజాగా ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 10కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. కాగా దగ్గుబాటి కుటుంబసభ్యులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లపై దగ్గుబాటి ఫ్యామిలీ లీగల్ టీమ్ రియాక్ట్ అయ్యింది. "విచారణ సమయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ గురించి కోర్టు చర్చించలేదని లీగల్ టీమ్ పేర్కొన్నది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయలేదు. కేసును తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతోనే ప్రత్యర్థులు చేస్తోన్న అసత్య ప్రచారాలు ఇవనీ, ఈ పుకార్లను ఎవరూ నమ్మవద్దని" పేర్కొన్నారు.
స్థలం లీజు...
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో కో ఆపరేటివ్ సొసైటీ నుంచి దగ్గుబాటి సురేష్ బాబు, రానా ఓ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఈ స్థలాన్ని నందకుమార్ అనే వ్యక్తికి సబ్‌లీజుకు ఇచ్చారు. ఇందులో నందకుమార్ దక్కన్ కిచెన్ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా నందకుమార్ అక్రమ నిర్మాణాలు చేపట్టాడని హోటల్‌ను 2024లో దగ్గుబాటి కుటుంసభ్యులు కూల్చేశారు. ఈ కూల్చివేతపై సురేష్‌బాబుతో పాటు ఆయన తనయులు రానా, అభిరామ్, హీరో వెంకటేష్‌లపై నందకూమార్ పలు సెక్షన్ల కేసుపెట్టారు. సదరు స్థలంపై ఎలాంటి చర్యలకు పాల్పడొద్దంటూ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హోటల్‌ను కూల్చేశారంటూ నందకుమార్ ఆరోపిస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



