Getup Srinu | మేము కాపులం పేరుతో నాగబాబు వెబ్‌సిరీస్ – జర్నలిస్ట్ జాఫర్‌పై గెటప్ శ్రీను ఫైర్
ఓ వెబ్‌సిరీస్ టైటిల్ విషయంలో కమెడియన్ గెటప్ శ్రీను, జర్నలిస్ట్ జాఫర్ మధ్య చోటుచేసుకున్న వివాదం ఆసక్తికరంగా మారింది. మేము కాపులం పేరుతో మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నట్లు గెటప్ శ్రీను చెప్పాడు. ఆ టైటిల్ బాగాలేదంటూ జాఫర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
Entertainment | Published On May 1, 2026, 7.29 pm IST
Getup Srinu | మెగా బ్రదర్ నాగబాబు తెలుగులో ఓ కొత్త వెబ్‌సిరీస్ చేయబోతున్నారు. ఈ సిరీస్‌కు మేము కాపులం అనే టైటిల్‌ను ఖరారు చేశారట. ఈ సిరీస్‌లో కమెడియన్ గెటప్ శ్రీను ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ను జర్నలిస్ట్ జాఫర్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను రివీల్ చేశాడు.
కులాన్ని వాడుకోవడం....
టైటిల్ విషయంలో జాఫర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తనకు నచ్చలేదంటూ పేర్కొన్నారు. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కోసం కులాన్ని వాడుకోవడం కరెక్ట్ కాదని జాఫర్ అన్నారు. ఈ క్రమంలో మాట మాట పెరిగి ఇంటర్వ్యూ మధ్యలో నుంచే గెటప్ శ్రీను వెళ్లిపోయాడు. జర్నలిస్ట్ జాఫర్ కు గెటప్ శ్రీను ఇచ్చిన ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
టైటిల్ నచ్చేసింది....
ఈ ఇంటర్వ్యూలో రాకస బ్లాక్‌బస్టర్ తర్వాత కొత్తగా ఉంటుందని నాగబాబుతో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు గెటప్ శ్రీను పేర్కొన్నాడు. "టైటిల్ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. డిఫరెంట్‌గా, క్యాచీగా ఉందనిపించదని" గెటప్ శ్రీను చెప్పాడు. మేము కాపులం అనే టెటిల్‌ను వెబ్‌సిరీస్‌కు ఫిక్స్ చేసినట్లు గెటప్ శ్రీను వెల్లడించాడు. ఆ టైటిల్ వద్దని గెటప్ శ్రీను మాటలకు జాఫర్ బదులిచ్చాడు. "రామ్ గోపాల్ వర్మ లాంటి గొప్ప డైరెక్టర్లు అమ్మ రాజ్యం టైటిల్‌కు సంబంధించి టైటిల్ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. కులం పేరుతో వెబ్ సిరీస్ ఏంటి? కాంట్రవర్సీ కోసమే టైటిల్ పెట్టారా" అంటూ జాఫర్ అన్నారు. అతడి మాటలకు జవాబు ఇచ్చేందుకు గెటప్ శ్రీను ప్రయత్నించారు. కానీ జాఫర్ అతడికి అవకాశం ఇవ్వలేదు. జాఫర్ మాటలతో అసహనం వ్యక్తం చేసిన గెటప్ శ్రీను “ఈ తొక్కలో ఇంటర్వ్యూ నేను చేయను” అంటూ మధ్యలోనే వెళ్లిపోయినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.
కథేమిటి....
గెటప్ శ్రీను వెళ్లిపోయిన తర్వాత జాఫర్, “నేను ఏం తప్పుగా అడిగాను? ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు?” అంటూ జాఫర్ అన్నారు. మేము కాపులం టైటిల్ వెనకున్న కథేమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది స్క్రిప్టెడా? లేదంటే నిజంగానే జాఫర్ ఇంటర్వ్యూ నుంచి గెటప్ శ్రీను నిజంగానే వెళ్లిపోయాడా అన్నది త్వరలోనే వెల్లడికానుంది.
Debate sparks over the title “Memu Kapulam” for the series starring Getup Srinu & Nagababu.
“Why use a caste name for a film? Didn’t like it,” says #Jaffer #MemuKapulam #GetupSrinu #Nagababu #Tollywood #TeluguCinema #Controversy #SocialDebate pic.twitter.com/Yre47bjN03
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) May 1, 2026
సంబంధిత వార్తలు

Tollywood | టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న పర్సంటేజీ వివాదం – కోలీవుడ్‌లోనూ ఒక రోజు స్ట్రైక్
మే 2, 2026

Prakash Raj | నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నిందలు వేస్తున్నారు – శ్రీరాముడి కామెంట్లపై ప్రకాష్ రాజ్ రియాక్షన్
ఏప్రిల్ 19, 2026

Pawan Kalyan | అల్లు శిరీష్ పెళ్లి – పవన్ కళ్యాణ్, నాగబాబులకు ఆహ్వానం…
ఫిబ్రవరి 23, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



