త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prakash Raj | నా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేక నింద‌లు వేస్తున్నారు – శ్రీరాముడి కామెంట్ల‌పై ప్ర‌కాష్ రాజ్ రియాక్ష‌న్‌

కేర‌ళ లిట‌రేచ‌ర్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌కాష్ రాజ్ చేసిన చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఈ విమ‌ర్శ‌ల‌పై ప్ర‌కాష్ రియాక్ట్ అయ్యారు. త‌న మాట‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని అన్నాడు. తాను అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేకే హిందూ వ్యతిరేకి అని త‌న‌పై ముద్ర‌లు వేస్తున్నార‌ని ప్ర‌కాష్ రాజ్ ఓ వీడియో ద్వారా రియాక్ట్ అయ్యారు.

N

Entertainment | Published On Apr 19, 2026, 2.59 pm IST

Prakash Raj | నా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేక నింద‌లు వేస్తున్నారు – శ్రీరాముడి కామెంట్ల‌పై ప్ర‌కాష్ రాజ్ రియాక్ష‌న్‌
Advertisement

Prakash Raj | శ్రీరాముడిపై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ చేసిన కామెంట్లు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖుల‌తో పాటు సామాన్యులు కూడా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌పై కేసులు న‌మోదు చేశారు. టీటీడీ బోర్డ్ మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి ప్ర‌కాష్ రాజ్‌కు లీగ‌ల్ నోటీసులు కూడా జారీ చేశారు.
నాస్తిక‌త్వం పేరుతో ప్ర‌కాష్ రాజ్ హిందూ ధ‌ర్మాన్ని ఆవ‌మానించారంటూ జ‌న‌సేన ఎమ్మెల్సీ, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు విమ‌ర్శ‌లు చేశారు. క్రిస్టియ‌న్ అయిన ప్ర‌కాష్ రాజ్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే శ్రీరాముడిపై అనుచిత కామెంట్లు చేశారంటూ కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.

వ‌క్రీక‌రించారు...

ఎట్ట‌కేల‌కు ఈ విమ‌ర్శ‌ల‌పై ప్ర‌కాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. "కేర‌ళ లిటరేచ‌ర్ ఫెస్టివ‌ల్‌లో నేను చేసిన కొన్ని మాట‌లు మాత్ర‌మే తీసుకొని వాటిని వ‌క్రీక‌రించారు. అవ‌తార పురుషుడు శ్రీరాముడి గురించి వెట‌కారంగా మాట్లాడాన‌ని...హిందూ మ‌తాన్ని...హిందువుల మ‌నోభావాల‌ను కించప‌రిచాన‌ని ఊగిపోతున్నారు. అన్ని ధ‌ర్మాల‌ను, అంద‌రిని ప్రేమించే నాకు ఆ అవ‌స‌రం లేదు. ధ‌ర్మాన్ని మ‌తోన్మాదంతో అడ్డుపెట్టుకొని అస‌హ్య‌మైన రాజ‌కీయాలు చేస్తున్న‌వాళ్లు...నేను అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌...హిందూ వ్య‌తిరేకి, ధ‌ర్మ విరోధి అని న‌న్ను నిదించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. వాళ్ల ఏడుపు నాకు అర్థం అవుతుంది. వాళ్ల‌కు స‌మాధానం చెప్పాలి. త్వ‌ర‌లో వ‌స్తాను. అప్ప‌టివ‌ర‌కు మీరు మీ ప‌నులు చూసుకుంటారా. ఇలాగే వాగుతుంటారా? ఊగుతుంటారా. అది మీ నిర్ణ‌యం" అంటూ ఈ వీడియోలో ప్ర‌కాష్ రాజ్ పేర్కొన్నారు.

వ‌ల‌స వ‌చ్చిన కూలీలు...

ఇటీవ‌ల జ‌రిగిన కేర‌ళ లిట‌రేచ‌ర్ ఫెస్టివ‌ల్‌కు ఓ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు ప్ర‌కాష్ రాజ్‌.ఈ వేడుక‌లో శ్రీరాముడితో పాటు ల‌క్ష్మ‌ణుడు ఉత్తర భార‌తం నుంచి ద‌క్షిణాదికి వ‌ల‌స వ‌చ్చిన కూలీలుగా ప్ర‌కాష్ రాజ్ పేర్కొన్నారు. ద‌క్షిణాదిలో గిరిజ‌న తెగ‌కు చెందిన రావ‌ణుడి తోట‌లో పండ్ల‌ను దొంగిలించార‌ని, అదే యుద్ధానికి దారితీసింద‌ని ప్ర‌కాష్ రాజ్ అన్నారు.

 

Advertisement
Advertisement