త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Cinemas | అల్లు సినిమాస్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే – మ‌ల్టీప్లెక్స్‌ను లాంఛ్ చేయ‌నున్న సీఎం

అల్లు అర్జున్ సొంత మ‌ల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ లాంఛింగ్ డేట్ ఫిక్స‌య్యింది. మార్చి 12న ఈ థియేట‌ర్ ప్రారంభంకాబోతుంది. ఈ వేడుక‌కు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజ‌రుకానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Mar 9, 2026, 3.22 pm IST

Allu Cinemas | అల్లు సినిమాస్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే – మ‌ల్టీప్లెక్స్‌ను లాంఛ్ చేయ‌నున్న సీఎం
Advertisement

Allu Cinemas |  హైద‌రాబాద్ సినీ ల‌వ‌ర్స్‌కు మ‌రో స‌రికొత్త మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ అందుబాటులోకి రాబోతుంది. అసియాలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్‌తో ఈ థియేట‌ర్ మూవీ ప్రియుల‌కు స‌రికొత్త థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందివ్వ‌బోతుంది. అల్లు సినిమాస్ పేరుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్మించిన ఈ థియేట‌ర్ ఈ నెల‌లోనే లాంఛ్ కాబోతుంది. కోకాపేట‌లో నెల‌కొల్పిన ఈ థియేట‌ర్ లాంఛింగ్ ఈవెంట్ మార్చి 12న జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు సినిమాస్ ప్రారంభోత్స‌వ వేడుక‌కు ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌తో...

అయితే సినిమాల స్క్రీనింగ్ మాత్రం మార్చి 19 నుంచి ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మార్చి 12 నుంచి 18 వ‌ర‌కు ట్ర‌య‌ల్ కోసం టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాల‌కు ప్ర‌ద‌ర్శించ‌నున్నార‌ట‌. మార్చి 19 నుంచి ఉస్తాద్‌భ‌గ‌త్‌సింగ్‌తో పాటు ధురంధ‌ర్ 2 సినిమాల‌తో ఈ థియేట‌ర్ ప్రారంభం కానున్న‌ట్లు చెబుతోన్నారు.

అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఎంటంటే?

దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్‌తో ఈ థియేట‌ర్ ప్రారంభం కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో డాల్బీ విజ‌న్ స్క్రీన్‌తో ఏర్పాటుకానున్న ఫ‌స్ట్ మ‌ల్టీప్లెక్స్ ఇదే. డాల్బీ స్క్రీన్‌తో ప్రస్తుతం పూణే, బెంగ‌ళూరుల‌లో మాత్ర‌మే థియేట‌ర్లు ఉన్నాయి. అల్లు సినిమాస్ కంటే వాటి స్క్రీన్‌సైజ్ త‌క్కువే కావ‌డం గ‌మ‌నార్హం.
అల్లు సినిమాస్‌లో మొత్తం నాలుగు స్క్రీన్స్ ఉండ‌బోతున్నాయ‌ట‌. మెయిన్ స్క్రీన్ సీటింగ్ కెపాసిటీ 644 వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంటున్నారు. పిచ్ బ్లాక్ స్టేడియం సీటింగ్‌, డాల్బీ అట్మాస్ వంటి ఆధునిక టెక్నాల‌జీ ఉపయోగించబోతున్నారట.  ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ఏఏఏ పేరుతో అమీర్‌పేట‌లో అల్లు అర్జున్ ఓ మ‌ల్టీప్లెక్స్ ప్రారంభించారు. అల్లు సినిమాస్ అతడు ఓనర్ గా వ్యవహరించనున్న రెండో థియేట‌ర్. ఏషియ‌స్ భాగ‌స్వామ్యంతో అల్లు అర్జున్ ఈ  మల్టీప్లెక్స్ ను నిర్మించారు.

Advertisement
Advertisement