Tollywood | పర భాష హీరోయిన్లను సపోర్ట్ చేయడం అలవాటైపోయింది – టాలీవుడ్‌పై బ్రహ్మాజీ కామెంట్స్
Tollywood | టాలీవుడ్ ఇండస్ట్రీపై నటుడు బ్రహ్మాజీ (Brahmaji) ఆసక్తికర కామెంట్స్ చేశారు. పర భాష హీరోయిన్లను సపోర్ట్ చేయడం టాలీవుడ్‌కు (Tollywood) అలవాటైపోయిందని అన్నాడు. ఈషా రెబ్బా తెలుగు అమ్మాయి అనే విషయం కూడా తెలియదంటూ బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Entertainment | Published On Dec 8, 2025, 8.15 pm IST
బ్రహ్మాజీ
Tollywood | తెలుగు సినీ పరిశ్రమలో (Tollywood) పర భాషల హీరోయిన్లదే డామినేషన్ కనిపిస్తుంటుంది. కన్నడ, తమిళంతో పాటు బాలీవుడ్ బ్యూటీస్ టాలీవుడ్‌ను రూల్ చేస్తున్నారు. టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో వీళ్లే కనిపిస్తుంటారు. అచ్చ తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు రావడం కష్టమేననే అపోహ చాలా కాలంగా ఉంది. , రీతూవర్మ, స్వాతి, ఈషా రెబ్బా, శాన్వీ మేఘనతో పాటు చాలా మంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా సినిమాలు చేశారు. కానీ ఆశించిన స్థాయిలో వారికి పేరు, గుర్తింపు మాత్రం దక్కలేదు.
తాజాగా పర భాష హీరోయిన్లను ప్రోత్సహించే కల్చర్‌పై నటుడు బ్రహ్మాజీ (Brahmaji)ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఓం శాంతి శాంతి శాంతి మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు బ్రహ్మాజీ కూడా అటెండ్ అయ్యారు. ఈ వేడుకలో బ్రహ్మాజీ మాట్లాడుతూ బయటి నుంచి హీరోయిన్లను తీసుకోవడం టాలీవుడ్‌కు అలవాటైపోయిందని అన్నాడు.
"ఈషా రెబ్బా టాలెంటెడ్ హీరోయిన్. మన తెలుగమ్మాయే. ఈ విషయం చాలా మందికి తెలియదు.చాలా బాగా నటిస్తుంది. ఆమెకు మన దర్శకనిర్మాతలు అవకాశాలు ఇస్తే బాగుంటుంది. కానీ మన ఇండస్ట్రీలో బయటి నుంచి హీరోయిన్లను ఎంకరేజ్ చేయడం అలవాటైపోయింది. ఓ శాంతి శాంతి శాంతి సినిమాలో మా అందరి కంటే ఎక్కువ పేరు ఈషారెబ్బాకే వస్తుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే నమ్మకముంది" అని బ్రహ్మాజీ అన్నారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఓం శాంతి శాంతి శాంతి మూవీకి ఏఆర్ సంజీవ్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో(Malayalam) విజయవంతమైన జయ జయ జయజయహే ఆధారంగా ఈ మూవీ రూపొందింది. 2026 జనవరి 23న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
అంతకుముందు ఆ తర్వాత మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈషా రెబ్బా. ఆ తర్వాత అమీతుమీ, అ! సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. అరవింద సమేత వీర రాఘవ, సవ్యసాచి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసింది ఈషారెబ్బా. రెండేళ్ల క్రితం వచ్చిన మామా మశ్చీంద్ర తో చివరగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈషారెబ్బా.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



