త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | త్రిష ఇంటి వ‌ద్ద హై టెన్ష‌న్ – పోలీసుల తనిఖీలు ….అసలేం జరిగిందంటే?

త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు రావ‌డం కోలీవుడ్‌లో క‌ల‌క‌లాన్ని రేపింది. త్రిష ఇంట్లో పేలుడు ప‌దార్థాలు అమ‌ర్చిన‌ట్లు డీజీపీ ఆఫీస్‌కు మెయిల్ వ‌చ్చింది. దాంతో బాంబు, డాగ్ స్వ్యాడ్‌తో క‌లిసి పోలీసులు త్రిష ఇంట్లో సోదాలు నిర్వ‌హించారు.

N

Entertainment | Published On Apr 13, 2026, 4.41 pm IST

Trisha | త్రిష ఇంటి వ‌ద్ద హై టెన్ష‌న్ – పోలీసుల తనిఖీలు ….అసలేం జరిగిందంటే?
Advertisement

Trisha |  కోలీవుడ్ అగ్ర హీరో...టీవీకే అధినేత ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో త్రిష డేటింగ్‌లో ఉన్న‌ట్లు కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ అత‌డి భార్య సంగీత ఇటీవ‌లే కోర్టును ఆశ్ర‌యించింది. ఆ త‌ర్వాత రోజే విజ‌య్‌, త్రిష క‌లిసి ఓ వెడ్డింగ్ రిసెప్ష‌న్‌కు జంట‌గా హాజ‌రుకావ‌డం హాట్‌టాపిక్‌గా మారింది. అప్ప‌టి నుంచి విజ‌య్‌, త్రిష బంధంపై రోజుకో వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. త్రిష పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌ని, పెళ్లి చేసుకోనుంద‌ని చాలానే రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.

హై టెన్ష‌న్‌...

ఈ రూమ‌ర్ల న‌డుమ తాజాగా త్రిష నివాసానికి బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. దాంతో ఆమె ఇంటి వ‌ద్ద సోమ‌వారం ఉద‌యం పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. రెండు, మూడు గంట‌ల పాటు త్రిష ఇంటి వ‌ద్ద హై టెన్ష‌న్ నెల‌కొంది.

త్రిష ఇంటిలో పేలుడు పదార్థాలను అమర్చినట్లు సోమవారం ఉదయం చెన్నైలోని డీజీపీ ఆఫీస్‌కు ఓ మెయిల్ వ‌చ్చింది. అప్రమత్తమైన పోలీసులు బాంబు, డాగ్‌ స్వ్యాడ్ నిపుణుల‌తో క‌లిసి త్రిష ఇంటిలో త‌నిఖీలు నిర్వ‌హించారు. మూడు గంట‌ల‌పైనే ఇంటిలోని ప్ర‌తి మూల‌లో వెతికార‌ట‌. సోదాల్లో ఎలాంటి పేలుడు ప‌దార్థాలు ల‌భించ‌లేద‌ట‌. దాంతో ఫేక్ మెయిల్‌గా గుర్తించిన పోలీసులు కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ చేస్తున్నారు.

రెండోసారి...

త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు రావ‌డం ఇది రెండోసారి. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ఇలాగే ఫేక్ మెయిల్స్ పంపించారు. త్రిష‌తో పాటు న‌య‌న‌తార‌, ర‌జ‌నీకాంత్‌, ధ‌నుష్, విజ‌య్ ఇంట్లో బాంబులు పెట్టిన‌ట్లు మెయిల్స్ రావ‌డం కోలీవుడ్‌లో క‌ల‌క‌లాన్ని రేపింది.

త్రిష హీరోయిన్‌గా న‌టించిన విశ్వంభ‌ర‌, క‌రుప్పు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ స‌మ్మ‌ర్‌లోనే ఈ రెండు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

 

Advertisement
Advertisement