త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shraddha Kapoor | ప్రభాస్ హీరోయిన్‌తో అల్లు అర్జున్ రొమాన్స్ – లోకేష్ క‌న‌గ‌రాజ్ మాస్ట‌ర్ ప్లాన్‌

సాహో త‌ర్వాత బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ తెలుగులో మ‌రో ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏ సినిమాలో అంటే?

N

Entertainment | Published On Jan 29, 2026, 4.10 pm IST

Shraddha Kapoor | ప్రభాస్ హీరోయిన్‌తో అల్లు అర్జున్ రొమాన్స్ – లోకేష్ క‌న‌గ‌రాజ్ మాస్ట‌ర్ ప్లాన్‌
Advertisement

Shraddha Kapoor |  పుష్ప 2 త‌ర్వాత టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌కు హ్యాండిచ్చిన అల్లు అర్జున్ వ‌రుస‌గా కోలీవుడ్ ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అట్లీ మూవీ షూటింగ్‌తో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే ఇటీవ‌లే లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో మ‌రో సినిమాకు బ‌న్నీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. అల్లు అర్జున్‌, లోకేష్ క‌న‌గ‌రాజ్ మూవీని ఓ వీడియో ద్వారా అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. కేవ‌లం యాభై ఒక్క సెకండ్ల నిడివితో కూడిన ఈ వీడియోతోనే పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఈ మూవీపై బ‌జ్ మొద‌లైంది ఈ వీడియో రికార్డ్ వ్యూస్‌ను ద‌క్కించుకుంది. అనౌన్స్‌మెంట్‌కే ఇలా ఉంటే రిలీజ్ త‌ర్వాత ఈ సినిమా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందోన‌నే ఆస‌క్తి అభిమానుల్లో మొద‌లైంది.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ...

అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న 23వ సినిమా ఇది. బ‌న్నీ మూవీతోనే లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. లోకేష్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.
బ‌న్నీ - లోకేష్ క‌న‌గ‌రాజ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పుష్ప 2తో బ‌న్నీకి బాలీవుడ్‌లో క్రేజ్ డ‌బుల్ అయ్యింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ హిందీలో 800 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బ‌న్నీ బాలీవుడ్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో శ్ర‌ద్ధాక‌పూర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ప్ర‌భాస్‌తో సాహో...

శ్ర‌ద్ధాక‌పూర్‌కు తెలుగులో ఇది సెకండ్ మూవీ. ప్ర‌భాస్ సాహోతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీ స‌క్సెస్ కాలేక‌పోయినా అల్లు అర్జున్‌తో సినిమా చేసే ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ ఏడాది జూలై లేదా ఆగ‌స్ట్ నుంచి బ‌న్నీ, లోకేష్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.
2024లో రిలీజైన బాలీవుడ్ మూవీ స్త్రీ 2తో పెద్ద విజ‌యాన్ని అందుకుంది శ్ర‌ద్ధా క‌పూర్‌. 50 కోట్ల బ‌డ్జెట్‌తో హార‌ర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా 870 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. స్త్రీ 2 త‌ర్వాత సినిమాల‌కు గ్యాప్ తీసుకుంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement