త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nargis Fakhri | బాలయ్య సినిమాలో హాట్ హీరోయిన్ … ఐటెంసాంగ్ కోసం రంగంలోకి బాలీవుడ్ సెన్సేషన్

టాలీవుడ్‌లోకి మ‌రో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ న‌ర్గీస్ ఫ‌క్రీ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Movies | Published On May 7, 2026, 2.41 pm IST

Nargis Fakhri | బాలయ్య సినిమాలో హాట్ హీరోయిన్ … ఐటెంసాంగ్ కోసం రంగంలోకి బాలీవుడ్ సెన్సేషన్
Advertisement

Nargis Fakhri |  ప్ర‌స్తుతం పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగు సినిమాలు స‌త్తా చాటుతున్నాయి. టాలీవుడ్ నుంచి ఓ మూవీ రిలీజ్ అవుతుందంటే దేశ‌వ్యాప్తంగా సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూసే ప‌రిస్థితి నెల‌కొంది. తెలుగు సినిమాల క్రేజ్ రాను రాను పెరుగుతుండ‌టంతో టాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు అన్ని భాష‌ల హీరోయిన్లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

దీపికా, అలియా త‌ర్వాత‌...

దీపికా ప‌డుకోన్‌, అలియా భ‌ట్ వంటి బాలీవుడ్ టాప్ హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేశారు. తాజాగా వీరి బాట‌లో మ‌రో హాట్ బ్యూటీ అడుగులు వేయ‌బోతుంది. న‌ర్గీస్ ఫ‌క్రీ టాలీవుడ్‌లో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే హీరోయిన్‌గా కాదు..స్పెష‌ల్ సాంగ్‌తో తెలుగు చిత్ర‌సీమ‌లోకి తొలి అడుగు వేయ‌బోతుంది.

గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీ...

బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీ తెర‌కెక్కుతోంది. వీర‌సింహారెడ్డి సూప‌ర్ హిట్‌ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ లేటెస్ట్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.
ఎన్‌బీకే 111 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌ను ప్లాన్ చేశార‌ట డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని. మాసీగా సాగే ఈ ప్ర‌త్యేక గీతంలో బాల‌కృష్ణ‌తో బాలీవుడ్ హాట్ హీరోయిన్ న‌ర్గీస్ ఫ‌క్రీ స్టెప్పులు వేయ‌బోతున్న‌ద‌ట‌. ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం హైద‌రాబాద్‌లో భారీ వ్య‌యంతో సెట్ వేశార‌ట వేశార‌ట‌. ఈ సెట్‌లో బాల‌కృష్ణ‌, న‌ర్గీస్ ఫ‌క్రీల‌పై శుక్ర‌వారం నుంచి (మే 8న‌) ఈ ఐటెంసాంగ్‌ను షూట్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ పాట‌లో న‌ర్గీస్ ఫ‌క్రీ డ్యాన్స్ అదిరిపోతుంద‌ని అంటున్నారు.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ...

ర‌ణ‌భీర్ క‌పూర్ హీరోగా ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రాక్‌స్టార్ మూవీతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది న‌ర్గీస్ ఫ‌క్రీ. తొలి సినిమాతోనే పెద్ద స‌క్సెస్ అందుకుంది. హిందీలో మై తేరా హీరో, అమ‌వాస్‌, హౌజ్‌ఫుల్ 5, మ‌స్తీ 4తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో గ్లామ‌ర‌స్ రోల్స్ చేసింది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement