Bigg Boss Amardeep | హీరోగా ఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్ తెలుగు రన్నరప్ – సుమతీ శతకం రిలీజ్ డేట్ ఫిక్స్
బిగ్‌బాస్ రన్నరప్ అమర్‌దీప్ చౌదరి డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఫిబ్రవరి 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అమర్‌దీప్‌కు జోడీగా శైలీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Jan 24, 2026, 3.30 pm IST
Bigg Boss Amardeep | బిగ్‌బాస్ తెలుగు రన్నరప్ అమర్‌దీప్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. సుమతీ శతకం పేరుతో ఓ మూవీ చేస్తున్నాడు.రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు ఎంఎం నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. సుమతీ శతకం రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఫిబ్రవరి 6న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్...
సుమతీ శతకం మూవీలో అమర్‌దీప్‌కు జోడీగా శైలీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, మహేష్ విట్టాతో పాటు మిర్చి కిరణ్ , జేడీవీ ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిన్న సినిమాను టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయబోతుంది. ఈ సినిమా నుండి "సుమతి సుమతి...ష అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కృష్ణ మాదినేని సాహిత్యం అందించిన ఈ పాటను గోల్డ్ దేవరాజ్ ఆలపించారుఏ. సుభాష్ ఆనంద్ మ్యూజిక్ అందించారు.
కుట్టీ కుట్టీ సుమతీ....
"నా కుట్టీ కుట్టీ సుమతీ, నా చిట్టీ చిట్టీ సుమతీ..." అంటూ సాగిన ఈ పాటలో విజువల్స్, అమర్ దీప్, శైలీ చౌదరి కెమిస్ట్రీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ అవుతోంది.బిగ్‌బాస్ సీజన్ 7లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు అమర్‌దీప్ చౌదరి. ఈ సీజన్‌లో ఫైనల్ చేరిన అతడు రన్నరప్‌గా నిలిచాడు. అమర్‌దీప్‌ను ఓడించి పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ గెలుచుకున్నాడు. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సుమతీశతకంతో పాటు చౌదరి గారి అబ్బాయి నాయుడి గారి అమ్మయితో పాటు మరికొన్ని సినిమాలు చేయబోతున్నాడు. బిగ్‌బాస్ కంటే ముందు జానకి కలగనలేదుతో పాటు మరొకొన్ని సీరియల్స్ చేశాడు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




