Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – 5 కోట్లతో తీస్తే నలభై కోట్లు వచ్చాయి…
ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మలయాళం డార్క్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భరతనాట్యం 2 నలభై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. తాజాగా ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఏ ఓటీటీలో...ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
Entertainment | Published On May 3, 2026, 4.46 pm IST
Malayalam OTT | ఈ ఏడాది మలయాళంలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది భరతనాట్యం 2 మోహినీయాట్టం (Bharathanatyam 2 Mohiniyattam). సైజు కురుప్, సూరజ్ వెంజరమూడు, జగదీష్, వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కృష్ణదాస్ మురళీ దర్శకత్వం వహించాడు.
భరతనాట్యం సీక్వెల్...
భరతనాట్యం సినిమాకు సీక్వెల్‌గా డార్క్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నలభై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. నిర్మాతలకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. భరతనాట్యం 2 మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మలయాళం మూవీ ఓటీటీ విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్ (Netflix)ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.
150వ మూవీగా
భరతనాట్యం సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు కృష్ణదాస్ ఈ సినిమాను రూపొందించారు. కామెడీ, క్రైమ్ ఎలిమెంట్‌ను బ్యాలెన్స్ చేసిన తీరు బాగుందంటూ కామెంట్స్ వచ్చాయి. నవ్విస్తూనే థ్రిల్‌ను పంచిందంటూ ప్రశంసలు వినిపించాయి. సైజు కురుప్ 150వ మూవీగా భరతనాట్యం 2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో సూరజ్ వెంజరమూడు విలన్ గా కనిపించారు. భరతనాట్యం ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ రానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
శవాన్ని మాయం చేశారా...
శశి ఓ పూజారి. గోవిందరాజ అనే వ్యక్తితో శశి కుటుంబానికి గొడవలు ఉంటాయి. ఓ రోజు అనుకోకుండా శశి ఇంట్లోనే గోవిందరాజ చనిపోతాడు. ఆ శవాన్ని మాయం చేయడానికి శశి కుటుంబం ఎన్ని తంటాలు పడింది. గోవింద రాజ శవాన్ని ముక్కలు చేసి ఎక్కడ దాచిపెట్టారు. సీఐ ప్రతాప్ ఇన్వేస్టిగేషన్‌లో శశి కుటుంబం గురించి ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అన్నదే ఈ మూవీ కథ.
మలయాళంలో హీరోగానే కాకుండా కమెడియన్‌గా, విలన్‌గా పలు సినిమాలు చేశాడు సైజు కురుప్. ఈ ఏడాది భరతనాట్యం 2తో పాటు ఆడు3 సినిమాలతో పెద్ద విజయాలను దక్కించుకున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






