త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Whats Up Naresh | బ‌ల‌గం హీరోయిన్ రొమాంటిక్ కామెడీ మూవీ – వాట్స‌ప్ న‌రేష్ గ్లింప్స్ రిలీజ్‌

కొత్త పోర‌డు వెబ్ సిరీస్ ఫేమ్ అన్వేష్ మైఖేల్ ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేయ‌బోతున్నారు. వాట్స‌ప్ న‌రేష్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో కావ్య క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ మూవీ గ్లింప్స్‌ను ఆదివారం రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Feb 8, 2026, 6.16 pm IST

Whats Up Naresh | బ‌ల‌గం హీరోయిన్ రొమాంటిక్ కామెడీ మూవీ – వాట్స‌ప్ న‌రేష్ గ్లింప్స్ రిలీజ్‌
Advertisement

Whats Up Naresh | కొత్త పోర‌డు వెబ్‌సిరీస్‌తో యాక్ట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడు అన్వేష్ మైఖేల్‌. తెలంగాణ‌ యాస‌, సంస్కృతుల‌కు ప్రాధాన్య‌మిస్తూ తెర‌కెక్కిన ఈ వెబ్‌సిరీస్ ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. తాజాగా అన్వేష్ మైఖేల్ ఓ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ చేయ‌బోతున్నారు. ఈ సినిమాకు వాట్స‌ప్ న‌రేష్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఇందులో బ‌ల‌గం ఫేమ్ కావ్య క‌ళ్యాణ్‌రామ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వాట్స‌ప్ న‌రేష్ మూవీకి సీవీ విశాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ గ్లింప్స్‌ను ఆదివారం రిలీజ్ చేశారు.

తెలంగాణ యాస‌తో...

స్వ‌చ్ఛ‌మైన తెలంగాణ యాస‌తో గ్లింప్స్‌లోని డైలాగ్స్ ఆస‌క్తిని పంచుతున్నాయి. క‌ట్నం డ‌బ్బుల‌తో లైఫ్‌లో సెటిల‌వ్వాల‌ని క‌ల‌లు క‌నే యువ‌కుడిగా అన్వేష్ మైఖేల్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఎన‌భై ల‌క్ష‌ల వ‌ర‌కు క‌ట్నం ఇస్తామ‌ని అమ్మాయిలు వాళ్లు అంటున్నార‌ని త‌ల్లిదండ్రులు చెప్ప‌గా...ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా అని అన్వేష్ మైఖేల్ స‌మాధానం ఇవ్వ‌డం వినోదాన్ని పంచుతోంది. హీరో పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ గ్లింప్స్‌లో వ‌చ్చిన సీన్స్ ఆస‌క్తిని పంచుతున్నాయి.

లోకం తీరింతే...

హీరోహీరోయిన్లు ఒక‌రికి మ‌రొక‌రు ప‌రిచ‌య‌మ‌య్యే స‌న్నివేశంతోనే గ్లింప్స్‌ను ఎండ్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన 'లోకం తీరింతే.. నువ్వే మారాలంతే.. లొల్లె ఒద్దంటే.. తెలివిని కప్పెట్టంతే' అనే లిరిక్స్‌తో సినిమా థీమ్‌ను, హీరో పాత్ర స్వ‌భావాన్ని వివ‌రించ‌డం గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలో న‌రేష్ అనే పాత్ర‌లో అన్వేష్ మైఖేల్‌...సారిక‌గా కావ్య క‌ళ్యాణ్ రామ్ క‌నిపించ‌బోతున్నారు.
సాఫ్ట్‌వేర్ లైఫ్‌, ప్రేమ‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా  డైరెక్టర్ విశాల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సీవీవీ సినిమా బ్యాన‌ర్ ప‌తాకంపై భాగ్య‌ల‌క్ష్మి చింత  నిర్మిస్తున్నారు. యువ‌త‌రం కోరుకునే హంగుల‌న్నీ ఈ సినిమాలో ఉంటాయ‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు.

మూడేళ్ల  త‌ర్వాత...

వాట్స‌ప్ న‌రేష్ మూవీకి స్మరణ్ సాయి మ్యూజిక్ అందిస్తున్నారు. వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ల‌వ‌ర్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న వాట్స‌ప్ న‌రేష్ సెకండ్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. వాట్స‌ప్ న‌రేష్‌లో సాయి సంతోష్, ఉషశ్రీ మురళి, సంతోష్ నందివాడ, ప్రియాంక రవిరు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత వాట్స‌ప్ న‌రేష్‌తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది కావ్య క‌ళ్యాణ్ రామ్‌.

Advertisement
Advertisement