Ayesha Khan | ధురంధర్ ఫేమ్ ఆయేషా ఖాన్ అరెస్ట్..! అసలు ఏం జరిగిందంటే..?
Ayesha Khan | ధురంధర్ మూవీ ఫేమ్, బాలీవుడ్ నటి ఆయేషా ఖాన్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల నిరసనలకు మద్దతుగా తెలిపేందుకు వెళ్లగా.. అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు.
Entertainment | Published On Jul 22, 2026, 8.20 pm IST
Ayesha Khan | ధురంధర్ మూవీ ఫేమ్, బాలీవుడ్ నటి ఆయేషా ఖాన్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల నిరసనలకు మద్దతుగా తెలిపేందుకు వెళ్లగా.. అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. తనతో పాటు స్నేహితులను ఎలాంటి కారణం చెప్పకుండా బలవంతంగా పోలీస్ వ్యాన్‌లో ఎక్కించారని ఆరోపించింది. బుధవారం దాదర్‌లో విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లానని.. సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకున్న వెంటనే ఓ పోలీసు అధికారి నిరసనకు అనుమతి లేదంటూ అరెస్టు చేశారని పేర్కొంది.
View this post on Instagram
అయితే, తాను “మాకు మరో మార్గం ఏంటో చెప్పండని అడిగాను. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా నన్ను నా సోదరుడు, స్నేహితులను వ్యాన్‌లోకి ఎక్కించారు” అని ఆయేషా పేర్కొంది. తనను నలుగురు, ఐదుగురు మహిళా పోలీసులు లాగి వ్యాన్‌లోకి తీసుకెళ్లారని చెప్పింది. “తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని పదే పదే అడిగాం. మా తప్పేంటో చెప్పాలని కోరాం. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. దాదర్ నుంచి మమ్మల్ని వర్లీకి తీసుకెళ్లారు” అని వివరించింది. వర్లీలోని పోలీస్ సిబ్బంది తమతో గౌరవంగా మాట్లాడారని, అసలు తమను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదని ఆయేషా తెలిపింది. పోలీస్ వ్యాన్‌లోకి తీసుకెళ్తున్న వీడియోను కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
View this post on Instagram
“శాంతియుతంగా నిలబడినందుకు అరెస్ట్ చేయడం ఎప్పటి నుంచి నేరం? నేను ఏ చట్టాన్ని ఉల్లంఘించాను?” అంటూ ఆమె ప్రశ్నించింది. “ప్రజల హక్కులను కాపాడాల్సిన సమయంలో వాటిని దెబ్బతీయడం బాధాకరం. నాకు ఇంకా మంచి భవిష్యత్తుపై నమ్మకం ఉంది” అని ఆయేషా పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో ప్రారంభమైన విద్యార్థుల నిరసనలు మంబయి సహా పలు నగరాలకు విస్తరించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శివాజీ పార్క్ సమీపంలోని చైత్యభూమి వద్ద కూడా నిరసనలు చేపట్టారు. నిరసన ప్రదేశానికి చేరుకునే ముందే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన






