Tollywood | ఎల్లమ్మ లగ్గం నుంచి బోనాల పండుగ దాకా…హైదరాబాద్ కల్చర్‌తో దిల్‌రాజు వారసుడి దేత్తడి
దిల్‌రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ హీరోగా నటిస్తున్న దేత్తడి మూవీ గ్లింప్స్ మంగళవారం రిలీజైంది. హైదరాబాద్ కల్చర్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఘన్ను భాయ్ అనే డప్పు కళాకారుడిగా ఆశిష్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు ఆదిత్య గంగాసాని దర్శకత్వం వహిస్తున్నాడు.
Entertainment | Published On Mar 24, 2026, 8.47 pm IST
Tollywood | రౌడీ బాయ్స్ తో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు దిల్‌రాజు సోదరుడి కుమారుడు ఆశిష్. ఆ తర్వాత లవ్ మీ అనే సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు నటుడిగా అతడికి పేరుతెచ్చిపెట్టినా కమర్షియల్‌గా మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. లవ్ మీ తర్వాత దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఆశీష్ దేత్తడితో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హైదరాబాద్ కల్చర్ తెరకెక్కిన ఈ సినిమాకు ఆదిత్య రావు గంగాసాని దర్శకత్వం వహించాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.
దేత్తడి మూవీలో...
మంగళవారం దేత్తడి మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ రేశారు. ఇందులో ఘన్ను భాయ్ అనే బ్యాండు కొట్టే యువకుడిగా రగ్గ్‌డ్ లుక్‌లో ఆశిష్ కనిపించారు. ఈ గ్లింప్స్‌లో ఆశిష్ డైలాగ్స్ కంప్లీట్ హైదరాబాదీ స్లాంగ్‌లో సాగాయి. మ్యానరిజమ్స్ కొత్తగా ఉన్నాయి. దేత్తడి కోసం ఆశిష్ మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంటుంది.
హైదరాబాద్ కల్చర్...
గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌లో దిల్‌రాజు మాట్లాడుతూ...హైదరాబాదులో ఉండే కల్చర్ ఫెస్టివల్స్ చుట్టూ ఈ కథ సాగుతుంది. ఎల్లమ్మ లగ్గం దగ్గర నుంచి బోనాలు, వినాయక చవితి, సదర్.. ఇలా అన్ని పండుగలను ఈ సినిమాలో చూపించబోతున్నాం. డప్పు కొట్టే కుర్రాడి జీవితంలో జరిగిన సంఘటనలతో సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాత్ర కోసం ఏడాదిగా ఆశిష్ , ఆదిత్య...బ్యాండ్ వాయించే వాళ్ళు చుట్టూ తిరుగుతూ... వాళ్ల జీవితాల తెలుసుకుంటూ వాళ్ళ లైఫ్ లో ఉండే ఇన్సిడెంట్ అన్ని పోగుచేసుకొని దేత్తడి కథను రాశారు. ఈ సినిమా కోసమే బ్యాండ్ ఎలా కొట్టాలి, ఎన్ని బ్యాండ్స్ ఉంటాయి, వారి బాడీలాంగ్వేజ్ ఎలా ఉంటుందన్నది ఆశిష్ నేర్చుకున్నాడు. హైదరాబాద్ కల్చర్ ని ప్రపంచానికి చూపించబోయే గొప్ప సినిమా అవుతుంది అని తెలిపారు.
హైదరాబాద్ సంస్కృతిని దేత్తడి రేంజ్ లో ఈ సినిమాలో చూపిస్తున్నామని హీరో ఆశీష్ అన్నారు. మన పండగలు మన పాటలు మన హైదరాబాద్ వాతవరణాన్ని ప్రపంచానికి చూపించాలనే తపనతో చేసిన సినిమా ఇదని, దేత్తడితో తన కల తీరబోతుందని దర్శకుడు పేర్కొన్నారు. దేత్తడి సినిమాకు ప్రసన్నకుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జునైద్ కుమార్ మ్యూజిక్ సమకూర్చుతున్నాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



