Ar Rahaman | బాలకృష్ణ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ – పదహారేళ్ల తర్వాత పెద్దికి మ్యూజిక్ – రెహమాన్ చేసిన తెలుగు సినిమాలు ఇవే
తెలుగులో ఏఆర్ రెహమాన్ ఇప్పటివరకు పదిలోపే సినిమాలు చేశారు. ఈ సినిమాలన్నీ మ్యూజికల్‌గా హిట్టైనా కమర్షియల్‌గా మాత్రం రెహమాన్‌కు విజయాలను తెచ్చిపెట్టలేకపోయాయి. దాదాపు పదహారేళ్ల తర్వాత పెద్దితో రెహమాన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
Entertainment | Published On Jan 6, 2026, 2.29 pm IST
Ar Rahaman | ఇండియన్ సినిమా మ్యూజిక్‌ను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పిన తొలి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. క్లాసికల్, వెస్ట్రన్ , హిప్‌హాప్ అన్ని రకాల సంగీతాలను మిక్స్ చేస్తూ మ్యూజిక్‌ను అందించడంలో దిట్ట. మెలోడీ, ఫాస్ట్‌బీట్...పాట ఏదైనా రెహమాన్ మ్యూజిక్ అందించాడంటే అది మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించాల్సిందే. తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ అందుకున్నారు. అస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలిచాడు. ఇలా ఒకటేమిటి సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన అందుకోని అవార్డు లేదు. ప్రస్తుతం ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా రెహమాన్ కావడం గమనార్హం.
బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లో రెహమాన్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీతో రెహమాన్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రాజ్‌కోటి వద్ద అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రెహమాన్ ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.
రెహమాన్ తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేశారు. అయితే ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమాల కంటే తమిళ డబ్బింగ్ సినిమాల్లోని పాటలే ఎక్కువగా హిట్టయ్యాయి.
ఇప్పటివరకు తెలుగులో పది వరకు మాత్రమే స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు సంగీతం అందించారు రెహమాన్. ప్రస్తుతం రామ్‌చరణ్ పెద్దికి రెహమానే మ్యూజిక్ డైరెక్టర్.
బాలకృష్ణ సినిమాతో...
తెలుగులో రెహమాన్ మ్యూజిక్ అందించిన ఫస్ట్ మూవీ బాలకృష్ణ నిప్పురవ్వ. ఈ సినిమాకు కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే సమకూర్చారు రెహమాన్. ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఆ తర్వాత వెంకటేష్ సూపర్ పోలీస్, రాజశేఖర్ గ్యాంగ్‌మాస్టర్, పల్నాటి పౌరుషం సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇవేవీ రెహమాన్‌కు విజయాలను అందించలేకపోయాయి. ఆ తర్వాత చాలా కాలం పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు.
మహేష్‌బాబు సినిమా...
దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత 2003లో మళ్లీ నాని సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు. మహేష్‌బాబు హీరోగా నటించిన ఈ మూవీ మ్యూజికల్‌గా హిట్టైనా కమర్షియల్‌గా మాత్రం ఫెయిల్యూర్‌గానే నిలిచింది. నీ మనసు నాకు తెలుసు, సాహసం శ్వాసగా సాగిపోతో పాటు పవన్ కళ్యాణ్ కొమురం పులి కూడా నాని బాటలోనే సాగాయి. కానీ ఈ సినిమాల్లోని రెహమాన్ అందించిన పాటలు మాత్రం ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కొమురం పులి తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చినా చేయలేదు రెహమాన్. తమిళం, హిందీ సినిమాలవైపే మొగ్గు చూపారు.
పెద్దితో పదహారేళ్ల తర్వాత...
పవన్ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చిన రెహమాన్...మళ్లీ మెగా హీరోతోనే కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నారు. రామ్ చరణ్ పెద్ది సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పదహారేళ్ల తర్వాత రెహమాన్ చేస్తున్న తెలుగు మూవీ ఇది. ఇటీవల పెద్ది నుంచి చికిరి సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. యూట్యూబ్‌లో రెండు వందల మిలియన్లకుపైగా వ్యూస్ దక్కించుకుంది. రామ్ చరణ్ పెద్దితో సినిమాతో తెలుగులో ఇప్పటివరకు హిట్ అందుకోలేదనే అపవాదును రెహమాన్ దూరం చేసుకుంటారో లేదో చూడాల్సిందే.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






