త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alia Bhatt | నువ్వు బంగారం.. యామీ గౌతమ్‌పై ఆలియా భట్‌ ప్రశంసలు..!

Alia Bhatt | బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ, యామీ గౌతమ్‌ నటించిన చిత్రం హక్‌. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్నది. నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకున్నది.

P

Entertainment | Published On Jan 12, 2026, 10.15 pm IST

Alia Bhatt | నువ్వు బంగారం.. యామీ గౌతమ్‌పై ఆలియా భట్‌ ప్రశంసలు..!
Advertisement

Alia Bhatt | బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ, యామీ గౌతమ్‌ నటించిన చిత్రం హక్‌. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్నది. నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకున్నది. సుపర్ణ్‌ వర్మ ఈ మూవీని తెరకెక్కించారు. మహిళల హక్కుల కోసం మద్దతు తెలిపిన షా బానో వర్సెస్‌ అహ్మద్‌ ఖాన్‌ కేసు ఆధారంగా  కోర్టు రూమ్‌ డ్రామాగా సుపర్ణ్‌ ఈ మూవీని చిత్రీకరించారు. ఈ మూవీని బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ ఇటీవల హక్‌ మూవీని చూశారు. ఈ మూవీ ఆమెకు బాగా నచ్చింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో హీరోయిన్‌ యామీ గౌతమ్‌ను ప్రశంసలతో ముంచెత్తింది.

తాను యామీకి అభిమానిగా మారిపోయానని తెలిపింది. ఇన్‌స్టా పోస్ట్‌లో యామీ గౌతమ్‌ను క్వీన్‌గా పోల్చింది. తన నటనతో ఆకట్టుకుందని, బంగారంలా తెరపై మెరిసిపోయిందని.. తాను ఇప్పటి వరకు చూసిన బెస్ట్‌ మహిళా పాత్రల్లో ఇది ఒకటి పేర్కొంది. యామీకి తాను పెద్ద అభిమానిని అయ్యానని.. రాబోయే తన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొంది. ఈ మూవీని చూసిన పలువురు బాలీవుడ్‌ తారలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆలియా కంటే ముందు కియారా అద్వానీ యామీని ప్రశంసించింది. తాను ఇప్పుడే సినిమా చూశానని.. ఇందులో అద్భుతంగా నటించిందని తెలిపింది.

ఈ సినిమాలో యామీ గౌతమ్ షాజియా బానో పాత్రలో, ఇమ్రాన్ హష్మీ ఒక లాయర్ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో వర్తికా సింగ్, డానిష్ హుస్సేన్, షీబా చద్దా, పరిధి శర్మ కీలకపాత్రలు పోషించారు. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ‘హక్‌’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 2025 నవంబర్‌లో విడుదలైన ఈ మూవీలో సుప్రీకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా చిత్రీకించారు. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీతో షా బానో నిజజీవిత కథ మళ్లీ ఒకసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. హక్ సినిమాకు షా బానో త్రిబుల్ తలాక్ కేసును ప్రేరణగా తీసుకున్నారు. మహిళల హక్కులు, లౌకికవాదం, మతం తదితర అంశాలను మూవీలో చూపించారు. పెళ్లయిన 40 సంవత్సరాల తర్వాత భర్త ట్రిపుల్‌ తాలక్‌తో విడాకులు ఇస్తే ఆమె పరిస్థితి ఏంటీ? న్యాయం కోసం షా బానో చేసిన పోరాటం ఏంటీ? సినిమాలో చూపించారు.

ఆలియా భట్‌ ప్రస్తుతం ఆల్ఫా చిత్రంలో నటిస్తున్నది. శివ్‌ రావాయిల్‌ దర్శకత్వం వహిస్తుంగా.. షర్వరి, బాబీ డియోల్‌ కీలకపాత్రలో పోషిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్‌ 17న విడుదల కానుంది. అలాగే, సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణబీర్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌తో కలిసి ‘లవ్‌ అండ్‌ వార్‌’ చిత్రంలోనూ కనిపించనున్నది. ఈ మూవీ సైతం ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement