Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌కు సర్జరీ – అభిమానుల్లో ఆందోళన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శనివారం సర్జరీ జరిగింది. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో పవన్ కళ్యాణ్‌ను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు సర్జరీ నిర్వహించారు. వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు.
Entertainment | Published On Apr 18, 2026, 8.47 pm IST
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శనివారం సాయంత్రం సర్జరీ జరిగింది. వారం నుంచి పది రోజుల పాటు పవన్ కళ్యాణ్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. సర్జరీ వార్తలతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ పరీక్షలు నిర్వహించారు.
డాక్టర్ల సూచనల మేరకు శనివారం సాయత్రం పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరిగింది. వారం నుంచి పది రోజులపాటు రెస్ట్ అవసరమని, ఆ తర్వాత అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. కొన్నాళ్ల పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, అనారోగ్య సమస్యల నుంచి పవన్ కళ్యాణ్ పూర్తి గా కోలుకోవడానికి చాలా రోజులే పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.
వరుణ్‌తేజ్ కూడా...
సినిమా షూటింగ్‌లో గాయపడ్డ మరో మెగా హీరో వరుణ్‌తేజ్‌కు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. తన గాయంపై వరుణ్‌తేజ్ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. సర్జరీ విజయవంతంగా పూర్తయ్యిందని, తాను రికవరీ అవుతున్నట్లు చెప్పాడు. బరిలో షూటింగ్ సెట్స్‌లో వాలీబాల్ సీన్స్ తీస్తుండగా వరుణ్ తేజ్ గాయపడ్డారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తోంది.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



