Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ – అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ – అన్‌ఫాలో చేసిందా?
కోలీవుడ్ హీరో ధృవ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ లవ్‌స్టోరీకి బ్రేకప్ పడినట్లు సమాచారం. విఫల ప్రేమాయణం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో అనుపమ పెట్టిన పోస్ట్‌లు వైరల్ అవుతోన్నాయి. తన మనశ్శాంతి కోసం కొన్ని గమ్యం లేని దారులను వదిలిపెట్టానని అనుపమ అన్నది.
Entertainment | Published On Jul 19, 2026, 5.25 pm IST
Anupama Parameswaran | హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లవ్‌స్టోరీకి బ్రేకప్ పడిందా? కోలీవుడ్ హీరో ధృవ్‌విక్రమ్ ఈ మలయాళ బ్యూటీ తెగతెంపులు చేసుకుందా? అంటే ఔననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. ధృవ్ విక్రమ్ బైసన్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షూటింగ్‌లోనే కోలీవుడ్ హీరోతో ఈ మలయాళ బ్యూటీ ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగింది.
క్లోజ్‌గా...
బైసన్ ప్రమోషన్స్‌లో ధృవ్, అనుపమ చాలా క్లోజ్‌గా కనిపించారు. వీరిద్దరి ఓ ముద్దు ఫొటో తెగ వైరల్ అయ్యింది. ఆ తర్వాత ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ఈవెంట్‌కు కలిసే అటెండ్ అయ్యారు.ఈ ఫొటోను ధృవ్ విక్రమ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. హార్ట్ ఎమోజీతో అనుపమ రిప్లై ఇచ్చింది. ప్రమోషన్స్‌కు కలిసే అటెండ్ కావడం, ఒకరి మాటలకు మరొకరు తెగ సిగ్గుపడిపోవడం, ఇంటర్వ్యూలలో వారి బాండింగ్ చూసిన వారంతా ధృవ్ విక్రమ్, అనుపమ ప్రేమలో ఉన్నది నిజమేనని అనుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో అర్ధరాత్రి రెండు గంటలకు ఏదైనా అత్యవసరం అయితే ఇండస్ట్రీలో మీరు ఎవరికి ఫోన్ చేస్తారని అడిగిన ప్రశ్నకు ధృవ్ విక్రమ్ పేరును అనుపమ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ధృవ్ అనుపమ లవ్‌స్టోరీకి ఇరు కుటుంబసభ్యులు ఓకే చెప్పారని, త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి.
బ్రేకప్...
అయితే ఈ ప్రేమకథ మూడునాళ్ల ముచ్చటగానే నిలిచినట్లు సమాచారం. మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడిపోయినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ సుదీర్ఘమైన పోస్ట్‌లు పెట్టింది. "నేను మళ్లీ నా జీవితాన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. నా మనశ్శాంతి కోసం కొన్ని గమ్యం లేని దారులను వదిలిపెట్టాల్సివచ్చింది. నా ప్రయాణం ఎటువైపు సాగాలన్నది ఇకపై నేనే నిర్దేశించుకుంటాను. ఎవరి నియంత్రణలు, భయాలు నన్ను ఆపలేవు. నా గొంతును నేనే వినిపిస్తా. ఇకపై మౌనంగా ఉండను" అంటూ అనుపమ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. బ్రేకప్ గురించి ఈ పోస్ట్‌ల ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా అనుపమ హింట్ ఇచ్చిందని నెటిజన్లు అంటున్నారు.
అన్‌ఫాలో...
చాలా రోజుల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడం, అది కూడా ఎమోషనల్ పోస్ట్ కావడతో బ్రేకప్ వార్తలు నిజమేనని చెబుతున్నారు. బ్రేకప్ బాధ కారణంగానే ఇన్నాళ్లు అనుపమ సోషల్ మీడియాకు దూరంగా ఉందని సమాచార .బ్రేకప్ రూమర్లకు బలాన్ని చేకూరుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ధృవ్ విక్రమ్‌ను అనుపమ పరమేశ్వరన్ అన్‌ఫాలో చేసింది. అఫీషియల్‌గా అనౌన్స్ చేయకుండానే అనుపమ లవ్‌స్టోరీకి శుభం కార్డు పడిందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ భోగితో పాటు క్రేజీ కళ్యాణం సినిమాలు చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఈ రెండు సినిమాల్లో తెలంగాణ అమ్మాయిగా కనిపించబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Anupama Parameswaran | అతడో అపరిచితుడు – సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి – మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు
ఆగస్టు 13, 2026

Chiyaan Vikram | చియాన్ విక్రమ్‌ను చిక్కుల్లో పడేసిన రీల్ – వన్య ప్రాణుల అక్రమ రవాణా ఆరోపణలు
ఆగస్టు 11, 2026

Ar Rahman Son | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏఆర్ రహమాన్ కొడుకు
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!



