Anasuya | అనసూయపై సోషల్ మీడియాలో వేధింపులు – 73 మందిపై కేసు నమోదు
సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు, మార్ఫింగ్ ఫొటోలతో తనను వేధింపులకు గురిచేసిన వారిపై అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అనసూయ కంప్లైంట్‌ను స్వీకరించిన పోలీసులు 73 మందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Entertainment | Published On Jan 16, 2026, 5.34 pm IST
Anasuya | సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వేధింపులపై అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. 73 మందిపై కేసు పెట్టింది. ఇందులో పొలిటికల్ లీడర్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్ట్‌లు ఉన్నట్లు సమాచారం.
ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగిస్తూ తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారని అనసూయ తన కంప్లైంట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. బెదిరింపులకు పాల్పడటమే కాకుండా తన జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని కంప్లైంట్‌లో వెల్లడించినట్లు సమాచారం.
అనసూయ కంప్లైంట్‌ను స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనసూయపై (Anasuya) వేధింపులకు పాల్పడిన 73 మందిని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇందులో కాంగ్రెస్ లీడర్ బొజ్జ సంధ్యారెడ్డితో పాటు కొందరు జర్నలిస్ట్‌లు, సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారట. అనసూయ పోలీస్ కంప్లైంట్‌పై సింగర్ చిన్మయి (Chinmayi) రియాక్ట్ అయ్యింది. అనసూయపై వేధింపులకు గురిచేసిన వారిలో రాజకీయ నాయకులు ఉన్నారంటూ పేర్కొన్నది. అనసూయపై అనుచిత కామెంట్లను చేసిన కొందరి వీడియోలను చిన్మయి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శివాజీతో గొడవ...
కాగా గత కొద్ది రోజులుగా అనసూయ ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌లపై శివాజీ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. మీ సలహాలు మాకు అక్కరలేదంటూ శివాజీకి అనసూయ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ఈ కామెంట్లు కాస్త అనసూయ, శివాజీ మధ్య గొడవగా మారాయి. ఈ వివాదంలో చాలా మంది నెటిజన్లు అనసూయను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో అటెన్షన్‌తో కోసమే అనసూయ ఇదంతా చేస్తుందంటూ కామెంట్లు పెట్టారు. ఈ విమర్శలపైఇటీవల ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది అనసూయ.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



