Netflix | నేరుగా ఓటీటీలోకి విజయ్ దేవరకొండ తమ్ముడి మూవీ – అంధుడి రివేంజ్…
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తక్షకుడు థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. తక్షకుడు టీజర్‌ను మంగళవారం మేకర్స్ రిలీజ్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ సినిమాలో లపాతా లేడీస్ ఫేమ్ నితాషీ గోయల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Feb 3, 2026, 8.34 pm IST
Netflix | విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. అన్న దారిలో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. 2024లో వచ్చిన గం గం గణేషా తర్వాత రెండేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ.
తక్షకుడు...
ప్రస్తుతం తక్షకుడు పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు ఆనంద్ దేవరకొండ. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. తక్షకుడు మూవీలో ఆనంద్ దేవరకొండ అంధుడిగా కనిపించబోతున్నట్లు టీజర్‌లో చూపించారు. రా అండ్ రస్టిక్‌గా ఈ టీజర్ సాగింది. విజువల్స్, బీజీఎమ్, లోకేషన్స్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అంధుడైన ఓ యువకుడి రివేంజ్‌తో తక్షకుడు తెరకెక్కుతోన్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఆనంద్ దేవరకొండ లుక్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నాయి.
మిడిల్ క్లాస్ మెలోడీస్ తర్వాత...
తక్షకుడు మూవీకి వినోద్ ఆనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆనంద్ దేవరకొండతో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా చేశాడు వినోద్. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. తక్షకుడు సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
లపాతా లేడీస్ హీరోయిన్...
తక్షకుడు మూవీలో బాలీవుడ్ హీరోయిన్ నితాషీ గోయల్ హీరోయిన్‌గా నటిస్తోంది. లపాతా లేడీస్ మూవీతో ఫేమస్ అయిన నితాషీ తక్షకుడుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. త్వరలోనే తక్షకుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తక్షకుడు మూవీకి రవితేజ కూతురు మోక్షద భూపతి రాజు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది.
తక్షకుడుతో పాటు ప్రస్తుతం ఎపిక్ అనే సినిమా చేస్తున్న ఆనంద్ దేవరకొండ. 90 మిడిల్ క్లాస్ మెలోడీస్ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లోనే రూపొందుతోంది.
Cheekati lokam lo.. Denikosam nee vethukulaata?
Paga?
Prema?
Kshama?Watch #Takshakudu on Netflix, coming soon in Telugu, Tamil, Hindi, Kannada and Malayalam #TakshakuduOnNetflix#NextOnNetflixIndia
#AnandDeverakonda @nitanshi_goel @vinodanantoju @vamsi84 @SitharaEnts… pic.twitter.com/CUlAZZ2ZNF— Sithara Entertainments (@SitharaEnts) February 3, 2026
సంబంధిత వార్తలు

Tripti Dimri | మాధురీ దీక్షిత్ కూతురిగా త్రిప్తి డిమ్రి – బాలీవుడ్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సాంగ్
మే 15, 2026

Keerthy Suresh | లేడీ డాన్‌గా కీర్తి సురేష్ – ఫుల్ యాక్షన్ మోడ్‌లో మహానటి…
మే 8, 2026

OTT | ఓటీటీలోకి రెండు వేల కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ – నాలుగు గంటల రన్టైమ్తో రిలీజ్
మే 8, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



