Ameesha Patel | చిక్కుల్లో బాలీవుడ్ హీరోయిన్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు..!
Ameesha Patel | బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ చిక్కుల్లో పడింది. 2017లో జరిగిన ఒక వివాహ వేడుకలో ఆమె ప్రదర్శన ఇచ్చేందుకు రూ.14.50 లక్షల అడ్వాన్స్ తీసుకుంది. అయితే, కార్యక్రమానికి హాజరు కాలేదని ఈవెంట్ నిర్వాహకుడు పవన్ వర్మ కోర్టును ఆశ్రయించారు.
Entertainment | Published On Feb 17, 2026, 9.15 pm IST
Ameesha Patel | బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ చిక్కుల్లో పడింది. 2017లో జరిగిన ఒక వివాహ వేడుకలో ఆమె ప్రదర్శన ఇచ్చేందుకు రూ.14.50 లక్షల అడ్వాన్స్ తీసుకుంది. అయితే, కార్యక్రమానికి హాజరు కాలేదని ఈవెంట్ నిర్వాహకుడు పవన్ వర్మ కోర్టును ఆశ్రయించారు. ఆ డబ్బును తిరిగి చెల్లించడానికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయింది అని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ కేసు కోర్టులో పలుసార్లు విచారణకు రాగా.. అమీషా పటేల్ హాజరుకాలేదు. దాంతో మొరాబాద్ కోర్టు మార్చి 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
విచారణకు గైర్హాజరవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్‌ని జారీ చేసింది. దీనిపై అమీషా పటేల్ స్పందించింది. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. ఇది చాలా విషయమని.. ఇప్పటికే కేసు సెటిల్ అయ్యిందని పేర్కొన్నారు. సెటిల్‌మెంట్ అగ్రిమెంట్ ప్రకారం మొత్తం చెల్లించామని.. ఇప్పుడు కేవలం ప్రచారం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే తామే పవన్ వర్మపై చీటింగ్ కేసు పెట్టనున్నట్లు తెలిపారు. గతంలో రాంచీ, ఇతర ప్రాంతాల్లో కూడా ఆమెపై చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






