త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి మ‌రో ఎదురుదెబ్బ – జ‌న‌నాయ‌గ‌న్ ఓటీటీ డీల్ క్యాన్సిల్‌

ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. విజ‌య్ న‌టించిన చివ‌రి మూవీ జ‌న‌నాయ‌గ‌న్ సెన్సార్ స‌మ‌స్య కార‌ణంగా వాయిదాప‌డింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్యాన్సిల్ అయ్యింద‌ట‌. ఈ డీల్ ర‌ద్దు వ‌ల్ల మేక‌ర్స్‌కు 120 కోట్ల‌కుపైనే న‌ష్టం వాటిల్లిన‌ట్లు చెబుతోన్నారు.

N

Entertainment | Published On Mar 12, 2026, 4.47 pm IST

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి మ‌రో ఎదురుదెబ్బ – జ‌న‌నాయ‌గ‌న్ ఓటీటీ  డీల్ క్యాన్సిల్‌
Advertisement

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి గ్యాప్ కూడా లేకుండా ఒక దాని త‌ర్వాత మ‌రోటి క‌ష్టాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి. రాజ‌కీయంగానే కాకుండా వ్య‌క్తిగ‌త జీవితంలోనూ వ‌రుస‌గా విజ‌య్‌ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. మ‌రోవైపువిజ‌య్ చివ‌రి మూవీ జ‌న‌నాయ‌గ‌న్‌ సెన్సార్ చిక్కుల కార‌ణంగా గ‌త రెండు నెల‌లుగా రిలీజ్‌కు నోచుకోవ‌డం లేదు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కాక‌పోవ‌డంతో వాయిదాప‌డింది. రెండు నెల‌లు దాటినా జ‌న‌నాయ‌గ‌న్ సెన్సార్ స‌మ‌స్య కొలిక్కి రాలేదు.

120 కోట్ల‌కు...

తాజాగా జ‌న‌నాయ‌గ‌న్‌ను మ‌రో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. థియేట్రిక‌ల్ డిలే కార‌ణంగా ఈ సినిమా ఓటీటీ డీల్ ర‌ద్ద‌యిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ద‌క్షిణాదిలో విజ‌య్‌కి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డానికి ముందే 120 కోట్ల‌కు అమెజాన్ ప్రైమ్ వీడియో జ‌న‌నాయ‌గ‌న్ డిజిట‌ల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది.

రిలీజ్ డైల‌మా...

సెన్సార్ స‌మ‌స్య‌ల కార‌ణంగా జ‌న‌నాయ‌గ‌న్‌ రిలీజ్ డైల‌మాలో ప‌డింది. ఆల‌స్యంపై మేక‌ర్స్ సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లిన ప‌రిష్కారం మాత్రం దొర‌క‌లేదు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడ‌న్న‌ది నిర్మాతలు కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దాంతో ఈ సినిమా ఓటీటీ డీల్‌ను అమెజాన్ ప్రైమ్ క్యాన్సిల్ చేసుకుంద‌ట‌. ఈ డీల్ ర‌ద్దు వ‌ల్ల మేక‌ర్స్‌కు 120 కోట్ల‌కుపైనే న‌ష్టం వాటిల్లిన‌ట్లు చెబుతోన్నారు. ఇప్ప‌టికే థియేట్రిక‌ల్ రిలీజ్ ఆల‌స్యం వ‌ల్ల మేక‌ర్స్‌కు భారీగానే లాస‌య్యారు. తాజాగా ఓటీటీ డీల్ వారికి గ‌ట్టి దెబ్బ త‌గిలిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

ఎన్నిక‌ల త‌ర్వాతే...

జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ స‌మ‌స్య సీరియ‌ల్‌లా గ‌త రెండు నెల‌లుగా సాగుతూనే ఉంది. రివైజింగ్ క‌మిటీ ఈ సినిమా చూసి త‌మ అభిప్రాయాల‌ను సీబీఎఫ్‌సీతో పాటు హైకోర్టుకు పంపించాల్సివుంది. కానీ ప‌లుమార్లు రివైజింగ్ క‌మిటీ స్క్రీనింగ్ వాయిదాప‌డింది. దాంతో జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ ఎలెక్ష‌న్స్ త‌ర్వాత మే నెలాఖ‌రున లేదా జూన్‌లో ఉండొచ్చ‌ని అంటున్నారు.

భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్‌...

జ‌న‌నాయ‌గ‌న్ మూవీకి హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో మ‌మితా బైజు కీల‌క పాత్ర పోషించింది. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన తెలుగు మూవీ భ‌గ‌వంత్ కేస‌రికి రీమేక్‌గా జ‌న‌నాయ‌గ‌న్ రూపొంద‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement