త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun | ధురంధ‌ర్ డైరెక్ట‌ర్‌లో అల్లు అర్జున్ మైథాల‌జీ మూవీ? – ఆగిపోయిన సినిమాపై మ‌ళ్లీ ఆశ‌లు?

Allu Arjun | ధురంధ‌ర్ డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్‌తో అల్లు అర్జున్ ఇమ్మోర్ట‌ల్ ఆఫ్ అశ్వ‌త్థామ పేరుతో ఓ మైథ‌లాజిక‌ల్ మూవీని చేయాల‌నుకున్నారు. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మైంది. ధురంధ‌ర్ హిట్‌తో మ‌ళ్లీ అల్లు అర్జున్ మూవీ తెర‌పైకి వ‌చ్చింది. ధురంధ‌ర్‌కు అల్లు అర్జున్ రివ్యూ కూడా ఇవ్వ‌డంతో ఈ మైథ‌లాజిక‌ల్ మూవీ క‌న్ఫామ్ అని అంటున్నారు.

N

Entertainment | Published On Dec 12, 2025, 5.16 pm IST

Allu Arjun | ధురంధ‌ర్ డైరెక్ట‌ర్‌లో అల్లు అర్జున్ మైథాల‌జీ మూవీ? – ఆగిపోయిన సినిమాపై మ‌ళ్లీ ఆశ‌లు?

Allu Arjun

Advertisement

Allu Arjun | ర‌ణ‌వీర్‌సింగ్ హీరోగా న‌టించిన ధురంధ‌ర్ (Dhurandhar)మూవీపై ఆడియెన్స్‌తో పాటు సెలిబ్రిటీలు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా ఈ స్పై యాక్ష‌న్ మూవీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కూడా ఫిదా అయ్యాడు. గురువారం హైద‌రాబాద్‌లో ధురంధ‌ర్ సినిమాను వీక్షించాడు అల్లు అర్జున్‌. మ‌హేష్‌బాబుకు చెందిన ఏఎమ్‌బీ థియేట‌ర్‌లో బ‌న్నీ ధురంధ‌ర్ సినిమా చూడ‌టానికి వ‌చ్చిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి.
ధురంధ‌ర్ సినిమా చూడ‌ట‌మే కాదు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ సినిమాకు రివ్యూ ఇచ్చాడు బ‌న్నీ. ఈ స్పై యాక్ష‌న్ మూవీపై త‌న అభిప్రాయాన్ని వ్య‌కం చేస్తూ బ‌న్నీ ట్వీట్ పెట్టాడు. ధురంధ‌ర్ సినిమా ఇప్పుడే చూశాను. అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్ర‌తి ఒక్క‌రూ అద‌రొట్టారు. టెక్నిక‌ల్లీ బ్రిలియెంట్ మూవీ. సౌండ్ ట్రాక్స్ బాగున్నాయి. ర‌ణ‌వీర్ స్క్రీన్ ప్ర‌జెన్స్ అమోఘం. వెర్స‌టైల్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. సంజ‌య్ ద‌త్‌, అక్ష‌య్ ఖ‌న్నా, మాధ‌వ‌న్‌... ఎవ‌రికి వారే త‌మ న‌ట‌న‌తో సాటి అనిపించుకున్నారు. సారా అర్జున్ చాలా అందంగా క‌నిపించింది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన ఆదిత్య ధ‌ర్ ఫుల్ స్వాగ్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు. నాకైతే ధురంధ‌ర్ చాలా న‌చ్చింది అంటూ బ‌న్నీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
ధురంధ‌ర్ కంటే ముందు అల్లు అర్జున్‌తో ఓ మైథాల‌జీ మూవీని తెర‌కెక్కించాల‌ని డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్ ప్లాన్ చేశాడు. ఇమ్మోర్ట‌ల్ ఆఫ్ అశ్వ‌త్ధామ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆల‌స్య‌మైంది. మైథాల‌జీ మూవీని ప‌క్క‌న‌పెట్టిన ఆధిత్య ధ‌ర్ ధురంధ‌ర్‌పై ఫోక‌స్ పెట్టాడు.
ధురంధ‌ర్‌తో ఆదిత్య ధ‌ర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవ‌డంతో మ‌ళ్లీ ఇమ్మోర్ట‌ల్ ఆఫ్ అశ్వ‌త్థామ సినిమా తెర‌పైకి వ‌చ్చింది. ఆదిత్య ధ‌ర్‌తో బ‌న్నీ ఈ సినిమా చేస్తే బాగుంటుంద‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు.
ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీతో అల్లు అర్జున్ ఓ పాన్ వ‌ర‌ల్డ్ సినిమా చేస్తున్నాడు. దాదాపు ప‌దిహేను వంద‌ల కోట్ల‌తో ఈ రొమాంటిక్ సైంటిఫిక్ యాక్ష‌న్ మూవీ రూపొందుతోంది. 2027లో బ‌న్నీ - అట్లీ మూవీ రిలీజ్ కాబోతుంది. అట్లీ ప్రాజెక్ట్‌ త‌ర్వాత బ‌న్నీ నెక్స్ట్ మూవీ ఆదిత్య ధ‌ర్‌తోనే ఉండొచ్చ‌ని అంటున్నారు. ఇమ్మోర్ట‌ల్ అశ్వ‌త్థామ మూవీ దాదాపు వెయ్యి కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

Advertisement

తాజావార్తలు

Advertisement