Kavitha | మహిళా రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీలో భారీ సభ నిర్వహిద్దాం : కల్వకుంట్ల కవిత
Kavitha | మహిళా రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హిమాయత్‌నగర్‌లో ఎన్‌సీఆర్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో “చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్స్ సాధన సభ” నిర్వహించారు. కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు.
Kavitha | మహిళా రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హిమాయత్‌నగర్‌లో ఎన్‌సీఆర్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో “చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్స్ సాధన సభ” నిర్వహించారు. కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలుకావాలని కవిత అన్నారు. ఈ లక్ష్య సాధన కోసం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. “బిల్లును సత్వరమే అమలు చేయాలంటే మన శక్తిని ప్రదర్శించాలి.
మహిళా బిల్లు అమలు చేయకపోతే ఓట్లు వేయమని గట్టిగా చెప్పాల్సిన సమయం వచ్చింది” అని ఆమె వ్యాఖ్యానించారు. మహిళల కోసం ధైర్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి పార్టీ పెట్టినట్లు ఆమె తెలిపారు. “మీరంతా గర్వపడేలా మంచి రాజకీయాలు చేస్తానని హామీ ఇస్తున్నాను” అని చెప్పారు. మహిళలు తప్పనిసరిగా పవర్‌ఫుల్ స్థానాల్లో ఉండాల్సిందేనని, అప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ, మహిళలకు చట్టపరంగా 33 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. పార్టీలు టికెట్లు ఇచ్చినా ఇతర పార్టీల వ్యూహాల కారణంగా మహిళలు ఓడిపోతున్న పరిస్థితి ఉందని, అందుకే చట్టపరమైన రిజర్వేషన్లు అవసరమని అన్నారు.
తమ పార్టీ తరఫున 33 శాతం కంటే తగ్గకుండా మహిళలకు సీట్లు కేటాయిస్తామని, సరైన నాయకత్వం ఉంటే 50 శాతం వరకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం 2022–23లో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించామని, 18 రాజకీయ పార్టీలతో చర్చలు జరిపించామని కవిత గుర్తుచేశారు. అయినప్పటికీ బిల్లును అమలు చేసే విషయంలో ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఓబీసీ, మైనార్టీ, మహిళా ప్రాతినిధ్యం అంశాలపై కూడా ఆమె మాట్లాడారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో అన్ని వర్గాల ప్రాతినిధ్యం పెరగాల్సిందేనని అన్నారు. చివరగా, మహిళల సాధికారత కోసం ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కవిత స్పష్టం చేశారు. “మహిళల కోసం ధైర్యంగా ముందడుగు వేశాను. వారి కోసం కచ్చితంగా పని చేస్తాను” అని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Beed School Bus Accident | స్కూల్ బస్సు దిగగానే ఘోరం.. సీసీటీవీ వీడియో వైరల్!
- ●CM Revanth Reddy | రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
- ●Netflix | ఓటీటీలో ప్రభాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రెండింగ్ - హాలీవుడ్ సినిమాలను దాటేసి...
- ●Afghanistan Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్, పాకిస్తాన్లలో వణికిన జనం
- ●Allu Sneha Reddy | నిర్మాతగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ - జోకర్ మూవీ లాంఛ్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా స్నేహారెడ్డి
- ●KTR | ఆర్ఎస్పీకి భద్రత తగ్గించడం పూర్తిగా కక్ష సాధింపు చర్యే : కేటీఆర్

Beed School Bus Accident | స్కూల్ బస్సు దిగగానే ఘోరం.. సీసీటీవీ వీడియో వైరల్!

CM Revanth Reddy | రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Netflix | ఓటీటీలో ప్రభాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రెండింగ్ - హాలీవుడ్ సినిమాలను దాటేసి...

Afghanistan Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్, పాకిస్తాన్లలో వణికిన జనం





