Alia Bhatt | కిల్లర్ పాత్రలో అలియా భట్.. ‘ఆల్ఫా’పై మూవీ భారీ అంచనాలు
Alia Bhatt | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆల్ఫా’పై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ స్పై యూనివర్స్ చిత్రంలో అలియా ఓ కిల్లర్ పాత్రలో కనిపించనుందన్న వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Entertainment | Published On May 30, 2026, 5.10 pm IST
Alia Bhatt | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆల్ఫా’పై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ స్పై యూనివర్స్ చిత్రంలో అలియా ఓ కిల్లర్ పాత్రలో కనిపించనుందన్న వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. అలియా పాత్ర ఇప్పటివరకు యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో కనిపించిన సాధారణ హీరోల తరహాలో ఉండదు. చిన్నప్పటి నుంచే హత్యలు చేయడానికి శిక్షణ పొందిన ఒక ప్రొఫెషనల్ అసాసిన్‌గా ఆమె పాత్రను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ఈ పాత్రను స్పైగా కాకుండా పూర్తిగా ‘ఆల్ఫా కిల్లర్’గా చూపించనున్నట్లు సమాచారం. ఈ పాత్రను సాధారణ నైతిక ప్రమాణాల్లో చూడాల్సిన అవసరం లేదని, తన నిర్ణయాలు తానే తీసుకునే శక్తివంతమైన మహిళా పాత్రగా రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకులు కొత్త తరహా, బలమైన లీడ్ క్యారెక్టర్లను కోరుకుంటున్న నేపథ్యంలో ఈ మార్పు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా ఈ చిత్రంతో స్పై యూనివర్స్‌కు కొత్త దిశ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు పురుష కేంద్రిత యాక్షన్ పాత్రలకు భిన్నంగా, పూర్తిగా ఒక మహిళా ప్రధాన పాత్రపై భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందిస్తున్నారని అంటున్నారు. అయితే, ఈ వార్తపై అధికారికంగా స్పష్టత రాలేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రతినిధి స్పందిస్తూ—ప్రస్తుతం ఎలాంటి విషయాన్ని ధ్రువీకరించలే, ఖండించనూలేమని పేర్కొన్నారు. ‘ఆల్ఫా’ ఫస్ట్ లుక్ విడుదలయ్యే వరకు వేచి చూడాలని సూచించారు. ఈ చిత్రంలో అలియా భట్‌తో పాటు షర్వరి కీలక పాత్రలో నటిస్తుండగా, బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అనిల్ కపూర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ది రైల్వే మెన్స్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన శివ్ రవైల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
మే 30, 2026

TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
మే 30, 2026

Peddi Movie | పెద్ది తెలంగాణలో షాక్.. ధరల పెంపును నో చెప్పిన హైకోర్టు..!
మే 30, 2026
తాజావార్తలు
- ●Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Japanese Walking Technique | 10,000 అడుగుల టార్గెట్ కష్టంగా ఉందా? అయితే ఈ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' మీ కోసమే!

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల



