Stock Markets | లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. అయినా తీవ్ర అస్థిరతతో సూచీలు..
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో వారాన్ని ప్రారంభించాయి. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నప్పటికీ.. కంపెనీల మెరుగైన ఆర్థిక ఫలితాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్ల మద్దతుతో కీలక సూచీలు ప్రారంభ ట్రేడింగ్‌లోనే భారీగా పుంజుకున్నాయి.
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో వారాన్ని ప్రారంభించాయి. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నప్పటికీ.. కంపెనీల మెరుగైన ఆర్థిక ఫలితాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్ల మద్దతుతో కీలక సూచీలు ప్రారంభ ట్రేడింగ్‌లోనే భారీగా పుంజుకున్నాయి. అయితే, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ కారణంగా మార్కెట్ ర్యాలీకి కొంత అడ్డంకి ఏర్పడింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో నిఫ్టీ50 సూచీ 25,206 పాయింట్ల వద్ద ప్రారంభమై 62 పాయింట్లు (0.25 శాతం) లాభపడింది. అనంతరం కొనుగోళ్ల మద్దతుతో మరో 110 పాయింట్లు ఎగబాకింది. బీఎస్ఈ సెన్సెక్స్ 81,811 పాయింట్ల వద్ద ప్రారంభమై 219 పాయింట్లు (0.27 శాతం) పెరిగింది. ఆ తర్వాత లాభాలు మరింత విస్తరించి 420 పాయింట్లకు చేరుకున్నాయి.
భారత మార్కెట్లలో కొనసాగనున్న జోరు..
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిరంతరంగా భారీ కొనుగోళ్లు చేస్తుండడంతో భారత మార్కెట్లపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు. గత నెలలో 9.4 శాతం రాబడితో ప్రపంచంలోని ప్రధాన మార్కెట్లలో భారత్ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు ప్రతికూల రాబడులను నమోదు చేశాయని వివరించారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగితే భారత మార్కెట్లలో ఈ మెరుగైన పనితీరు మరింత కాలం కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళనలు మార్కెట్ ర్యాలీని కొంత పరిమితం చేస్తాయని అభిప్రాయపడ్డారు. స్వల్పకాలంలో మార్కెట్ దిశ మాత్రం సానుకూలంగానే కనిపిస్తోందని తెలిపారు.
ముడిచమురు, బంగారం, వెండి ధరల్లో తగ్గుదల..
కమోడిటీ మార్కెట్‌లోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక శాతం తగ్గి బ్యారెల్‌కు 95 డాలర్లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,35,800 వద్ద ట్రేడవుతూ 0.62 శాతం తగ్గింది. వెండి ధర కిలోకు రూ.1,70,937 వద్ద కొనసాగుతూ 3 శాతం క్షీణించింది.
సంబంధిత వార్తలు

Stock Markets | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
నవంబర్ 16, 2026

FPI Investments | విదేశీ పెట్టుబడిదారుల యూ టర్న్.. ఈ నెలలో రూ.84వేల కోట్లు రాక.. కారణాలేమిటి..?
నవంబర్ 14, 2026

Stock Markets | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..
నవంబర్ 13, 2026
తాజావార్తలు
- ●BRS Party | 22న ఓరుగల్లులో బీఆర్ఎస్ బహిరంగ సభ..!
- ●Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
- ●Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు
- ●Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!
- ●Horoscope | నవంబర్ 17 రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం తథ్యం..!
- ●Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!

BRS Party | 22న ఓరుగల్లులో బీఆర్ఎస్ బహిరంగ సభ..!

Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు

Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!



