Aishwarya Rajesh | అప్పుడు వెంకీతో …ఇప్పుడు నాగ్‌తో – కింగ్ 100లో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్?
నాగార్జున వందో సినిమాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో కథానాయికగా ఐశ్వర్య రాజేష్ ఛాన్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగార్జున హీరోగా నటిస్తోన్న వందో సినిమా ఇది.
Entertainment | Published On Mar 28, 2026, 3.26 pm IST
Aishwarya Rajesh | వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో ఫస్ట్ కమర్షియల్ హిట్‌ను దక్కించుకుంది ఐశ్వర్యరాజేష్. భాగ్యం పాత్రలో ఐశ్వర్య రాజేష్ కామెడీ టైమింగ్, మ్యానరిజమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. గత ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ 300 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత తాజాగా మరో సీనియర్ హీరోతో ఐశ్వర్య రాజేష్ జోడీకట్టబోతున్నట్లు సమాచారం. నాగార్జున సినిమాలో కథానాయికగా కనిపించబోతున్నట్లు చెబుతోన్నారు.
పొలిటికల్ థ్రిల్లర్...
నాగార్జున హీరోగా తమిళ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. నాగార్జున హీరోగా నటిస్తోన్న వందో సినిమా ఇది. ఇందులో సీనియర్ హీరోయిన్ టబు మలయాళ నటి సుస్మిత భట్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. కింగ్100 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ ఛాన్స్ ఐశ్వర్య రాజేష్‌కు దక్కినట్లు సమాచారం. యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కావడంతో మేకర్స్ ఐశ్వర్య రాజేష్‌ను ఎంపికచేసినట్లు తెలిసింది. రెగ్యులర్ హీరోయిన్లలా పాటలకే పరిమితం కాకుండా కథలో చాలా కీలకంగా ఆమె పాత్ర ఉంటుందని అంటున్నారు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో ఐశ్వర్య రాజేష్ జాయిన్ కానున్నట్లు చెబుతున్నారు.
సీఎం పాత్రలో...
ఇందులో టబు సీఎం పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. లాటరీ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది దసరాకు నాగార్జున వందవ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రెండు వెబ్ సిరీస్‌లు...
ప్రస్తుతం తెలుగులో ఇసాకపట్నం, రెండు లాంతర్లు అనే వెబ్‌సిరీస్‌లు చేస్తోంది ఐశ్వర్య రాజేష్. ఇకాకపట్నం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతుండగా...రెండు లాంతర్లు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఓ సుకుమారి పేరుతో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తీరువీర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



