త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Renu Desai | న్యాయం అన్న‌ది జోక్‌గా మారింది – సుప్రీం కోర్టు తీర్పుపై రేణు దేశాయ్ కామెంట్స్‌…

రోడ్డు ప్ర‌మాదాలు, డెంగ్యూ వంటి వాటితో పోలిస్తే కుక్క‌కాటు వ‌ల్ల చ‌నిపోతున్న వారి సంఖ్య త‌క్కువేన‌ని సినీ న‌టి రేణు దేశాయ్ అన్నారు. వీధి కుక్క‌ల‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై త‌న‌కు న‌మ్మ‌కం లేదంటూ కామెంట్స్ చేసింది.

N

Entertainment | Published On Jan 19, 2026, 4.38 pm IST

Renu Desai | న్యాయం అన్న‌ది జోక్‌గా మారింది – సుప్రీం కోర్టు తీర్పుపై రేణు దేశాయ్ కామెంట్స్‌…
Advertisement

Renu Desai | నాలుగైదు కుక్క‌లు క‌రుస్తున్నాయ‌ని వంద‌లాది వీధి కుక్క‌ల‌ను చంప‌డం క‌రెక్ట్ కాద‌ని సినీ నటి రేణు దేశాయ్ అన్న‌ది. నోరు లేని అమాయ‌క జీవుల‌ను చంప‌డం ఎంత వ‌ర‌కు న్యాయ‌మ‌న్న‌ది సుప్రీంకోర్టు ఆలోచించాల‌ని రేణు దేశాయ్ చెప్పింది. వీధి కుక్క‌ల స‌మ‌స్య‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రేణు దేశాయ్ ఫైర్ అయ్యింది. సోమ‌వారం వీధి కుక్క‌ల సంర‌క్ష‌ణ‌పై ఏర్పాటుచేసిన ఓ పాత్రికేయుల స‌మావేశంలో రేణు దేశాయ్ పాల్గొన్న‌ది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ వీధి కుక్క‌ల‌ను కాపాడ‌టం కోసం తాను గ‌త ఏడాదిన్న‌ర‌గా రెస్క్యూ సెంట‌ర్ న‌డుతున్నాన‌ని చెప్పింది. వీధి కుక్క‌ల వ‌ల్ల గ‌త కొన్నేళ్లుగా ఎంత మంది కాటుకు గుర‌య్యారో లెక్క‌ల‌న్నీ త‌న త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని చెప్పింది. రోడ్డు ప్ర‌మాదాలు, డెంగ్యూ లాంటి వాటితో పోలిస్తే కుక్క కాటు వ‌ల్ల చ‌నిపోతున్న వారి సంఖ్య త‌క్కువేన‌ని అన్న‌ది. కానీ వాటిని ప‌క్క‌న‌పెట్టి వీధి కుక్క‌ల స‌మ‌స్య‌ను పెద్ద‌దిగా చేస్తున్న‌ర‌ని పేర్కొన్న‌ది.

అవ‌స‌రం లేదు...

"వీధి కుక్క‌ల‌ సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా వాటిని చంపాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం స‌బ‌బు కాద‌ని రేణు దేశాయ్ అన్న‌ది. హైద‌రాబాద్‌లోని ఓ లా కాలేజ్ వాళ్లు న‌ల‌భై కుక్క‌ల‌ను చంపార‌నే వార్త చూశాను. మ‌రో చోట‌ ఓ స‌ర్పంచ్ ఐదు వంద‌ల కుక్క‌లు చంపార‌ని తెలిపింది. ఈ వార్త‌లు చూడ‌గానే ఎంతో బాధ క లిగింది. కొంచెం కూడా భ‌యం భ‌క్తి లేవా అని అడుగుతున్నాను. కాల‌భైర‌వ పేరుతో కుక్క‌నే దేవుడిగా పూజిస్తున్నారు. కానీ ఆ కుక్క‌ల‌నే చంపేస్తున్నారు. క‌ర్మ ఫ‌లితాన్ని త‌ప్ప‌కుండా అనుభ‌విస్తారు. రోడ్డుపై గుంత‌ల వ‌ల్ల‌, హెల్మెట్ పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్ల యాక్సిడెంట్స్ జ‌రుగుతూ ఎంతో మంది చ‌నిపోతున్నారు. వాటిని మాత్రం ప‌ట్టించుకోకుండా ఈజీగా తీసుకుంటున్నారు" అని రేణు దేశాయ్ అన్న‌ది.

విచ‌క్ష‌ణ జ్ఞానంతో...

"కొంద‌రు మ‌గాళ్లు రేపులు, మ‌ర్డ‌ర్స్ చేస్తున్నార‌ని అంద‌రిని చంపేయ‌లేం క‌దా. విచ‌క్ష‌ణ జ్ఞానంతో ఆలోచించాలి. అలాగే నాలుగైదు కుక్క‌లు అగ్రెసివ్‌గా ఉన్నాయ‌ని అన్నింటిని చంప‌డం క‌రెక్ట్ కాదు. ఇన్నాళ్లు దీనిపై సెలైంట్‌గా ఉన్నా. కానీ రోజురోజుకు కుక్క‌ల‌ను చంపుతున్నార‌నే వార్త‌లు ఎక్కువైపోవ‌డంతో కోపాన్ని, బాధ‌ను అణుచుకోలేక మాట్లాడుతున్నాను . మ‌నుషుల‌తో పాటు కుక్క‌ల‌ను కూడా దేవుడే సృష్టించాడు. వాటికి వాటికి బ‌తికే హ‌క్కు ఉంది". అని రేణు దేశాయ్ అన్న‌ది.

ప‌క్ష‌పాతంగా...

"సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని రేణు దేశాయ్ అన్న‌ది. తీర్పు ఇచ్చిన జ‌డ్జికి వీధి కుక్క‌ల వ‌ల్ల ఏదైన అన్యాయం జ‌రిగి ఉంటుంది. అందుకే వ్య‌క్తిగ‌త ద్వేషంతో ప‌క్ష‌పాతంగా ఇలాంటి తీర్సు ఇచ్చాడ‌ని అనుకుంటున్నా. మాన‌వ‌త్వం, ద‌య‌తో ఇచ్చిన తీర్పు కాదు అది. నేను మాట్లాడింది త‌ప్పు అయితే అరెస్ట్ చేయండి. న్యాయం అన్న‌ది నేడు జోక్‌గా మారింది. డ‌బ్బు ఉంటే సేఫ్..డ‌బ్బులు లేక‌పోతే ర‌క్ష‌ణ లేదు అనే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని" రేణు దేశాయ్ అన్న‌ది.

Advertisement

తాజావార్తలు

Advertisement