త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Payal Rajput | ఇండస్ట్రీని వదిలేది లేదన్న పాయల్‌ రాజ్‌పుత్‌..! సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌..!

Payal Rajput | హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ గురించి పరిచయం అవసరం లేదు. ఆర్‌ఎక్స్‌ 100, ఆర్డీఎక్స్‌ లవ్‌, మంగళవారం తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నది. ముఖ్యంగా ఆర్‌ఎక్స్‌ 100 మూవీతో ఇండస్ట్రీకి షేక్‌ చేసింది పాయల్‌.

P

Entertainment | Published On Feb 4, 2026, 1.36 pm IST

Payal Rajput | ఇండస్ట్రీని వదిలేది లేదన్న పాయల్‌ రాజ్‌పుత్‌..! సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌..!
Advertisement

Payal Rajput | హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ గురించి పరిచయం అవసరం లేదు. ఆర్‌ఎక్స్‌ 100, ఆర్డీఎక్స్‌ లవ్‌, మంగళవారం తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నది. ముఖ్యంగా ఆర్‌ఎక్స్‌ 100 మూవీతో ఇండస్ట్రీకి షేక్‌ చేసింది పాయల్‌. ఆ తర్వాత కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా మారుతుందని భావించినా పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత అదే జానర్‌లో వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే, సెలెక్టెడ్‌ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నది. ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తుంది. అభిమానులతో ఫొటోలను షేర్‌ చేసుకుంటూ ఉంటుంది.

తాజాగా ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది. సినిమాలు మానేయాలని కొందరు కోరుకుంటున్నారని.. తాను మాత్రం వదలనని స్పష్టం చేసింది. తనను ఇండస్ట్రీ వదిలేయాలంటున్నారు. నేను కూడా మానేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. కానీ, అప్పుడే 12 ఏళ్లుగా తాను పడ్డ కష్టం గుర్తుకు వస్తుంది. ఓడిపోవచ్చు కానీ నేను మాత్రం వదిలిపెట్టను’ అని పేర్కొంది. గత ఏడాది సినీ పరిశ్రమలో బంధుప్రీతి, పక్షపాతం ప్రతిభను కప్పేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. నటిగా ఉండడం అత్యంత కష్టమైన వృత్తుల్లో ఒకటని పేర్కొంది. ప్రముఖులు, బలమైన ఏజెంట్లు ఉన్న వారికి అవకాశాలు దక్కుతున్నాయని.. అలాంటి వాతావరణంలో తన కష్టానికి గుర్తింపు లభిస్తుందా? అన్న సందేహం కలుగుతుందని పాయల్‌ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. పాయల్‌ ప్రస్తుతం తమిళం, తెలుగు చిత్రాల్లో ఫుల్‌ బిజీగా ఉంది. ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెంకటలక్ష్మి’ అనే చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. తమిళంలో లెజెండ్ సరవణన్ సరసన ఆయన రెండో తమిళ చిత్రంలో పాయల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆర్ఎస్ దురై సెంతిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో షామ్, ఆండ్రియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. చెన్నైలో తొలి షెడ్యూల్ పూర్తికాగా, రెండో షెడ్యూల్‌ను సరవణన్ స్వస్థలమైన తూత్తుకుడి సమీపంలో చిత్రీకరించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, ఎస్ వెంకటేశ్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే, మరో తమిళ చిత్రం ఏజెంట్‌లోనూ హీరోయిన్‌గా నటిస్తున్నది.

Advertisement
Advertisement