Samyuktha | షూటింగ్‌లో గాయపడ్డ సంయుక్త..! యాక్షన్ స్వీకెన్స్ చిత్రీకరిస్తుండగా ఘటన..!
Samyuktha | సంయుక్త మీనన్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నది. మొన్నటి వరకు గ్లామర్ రోల్స్‌లో కనిపించిన ఈ మల్లు బ్యూటీ సరికొత్త యాక్షన్ అవరాత్‌లో కనిపించనున్నది. యాక్షన్ డ్రామాగా 'ది బ్లాక్ గోల్డ్' తెరకెక్కుతున్న ఈ మూవీలో సరికొత్త అవతార్‌లో కనిపించనున్నది.
Entertainment | Published On Feb 4, 2026, 9.15 pm IST
Samyuktha | సంయుక్త మీనన్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నది. మొన్నటి వరకు గ్లామర్ రోల్స్‌లో కనిపించిన ఈ మల్లు బ్యూటీ సరికొత్త యాక్షన్ అవరాత్‌లో కనిపించనున్నది. యాక్షన్ డ్రామాగా 'ది బ్లాక్ గోల్డ్' తెరకెక్కుతున్న ఈ మూవీలో సరికొత్త అవతార్‌లో కనిపించనున్నది. ఇటీవల విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ మూవీలో సంయుక్త పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నది. ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ చిత్రీకరిస్తుండగా.. సంయుక్త గాయపడింది. ఆ తర్వాత చిత్రబృందం వెంటనే హాస్పిటల్‌కు తరలించినట్లు తెలుస్తోంది. చేతికి గాయమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.
ఈ మూవీకి యోగేశ్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే చిత్రం షూటింగ్ సుమారు 75 శాతం పూర్తయ్యింది. 'ది బ్లాక్ గోల్డ్' చిత్రం 2026 వేసవిలో విడదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. సంయుక్త మీనన్ చివరగా తెలుగులో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారీ సినిమాలో నటించింది. ప్రస్తుతం కెరీర్‌లోనే ఫుల్ బిజీగా ఉన్నది. తెలుగులో నిఖిల్ సరసర స్వయంభు తో పాటు స్లమ్ డాగ్ః 33 టెంపుల్‌రోడ్ మూవీలో నటిస్తున్నది. తమిళంలో మహారాగ్ఞి : క్వీన్ ఆఫ్ క్వీన్స్, మలయాళంలో రామ్ మూవీలో నటిస్తున్నది.

తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






