త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | 19000 కోట్ల యానిమేష‌న్ మూవీలో ఓటీటీలోకి వ‌స్తోంది – మూడు భాష‌ల్లో రిలీజ్‌

2025 ఏడాదిలో వ‌ర‌ల్డ్ వైడ్‌గా హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన యానిమేష‌న్ మూవీ నేఝా 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఫిబ్ర‌వ‌రి 20న‌ జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

N

Entertainment | Published On Feb 17, 2026, 9.00 pm IST

OTT | 19000 కోట్ల యానిమేష‌న్ మూవీలో ఓటీటీలోకి వ‌స్తోంది – మూడు భాష‌ల్లో రిలీజ్‌
Advertisement

OTT | నేఝా 2...గ‌త ఏడాది వ‌ర‌ల్డ్ వైడ్‌గా హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అవ‌తార్ ఫైర్ అండ్ యాష్, జురాసిక్ వ‌ర‌ల్డ్ లాంటి సినిమాల‌ను అధిగ‌మిస్తూ 19000 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో ఈ యానిమేష‌న్ మూవీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. కేవ‌లం 840 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది.
ఈ యానిమేష‌న్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. నేఝా 2 ఓటీటీ రిలీజ్‌డేట్‌తో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మంగ‌ళ‌వారం క‌న్ఫామ్ అయ్యాయి. ఫిబ్ర‌వ‌రి 20 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. మాండ‌రిన్‌, ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాష‌ల్లో రిలీజ్ కానున్న‌ట్లు జియో హాట్‌స్టార్ ప్ర‌క‌టించింది.

సీక్వెల్‌...

2019లో రిలీజైన నేఝా మూవీకి సీక్వెల్‌గా నేఝా 2 మూవీ తెర‌కెక్కింది. యానిమేష‌న్ యాక్ష‌న్ ఫాంట‌సీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు జియావోజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. చైనీస్ పురాణాల నేప‌థ్యంలో నేఝా 2 తెర‌కెక్కింది. నేఝాతో పాటు అత‌డి స్నేహితుడు అవోబింగ్ ఆత్మ‌లుగా ఎందుకు మారారు? మ‌ర‌ణం లేకుండా ఉండ‌టానికి వారు ఎదుర్కొన్న ప‌రీక్ష‌లు ఏమిటి? ప్ర‌తీకారంతో ర‌గిలి షెన్ గాంగ్ బావోతో పాటు డ్రాగ‌న్ సైన్యంతో పాటు విధిని ఎదురించి నేఝా ఎలాంటి పోరాటం సాగించాడ‌నే అంశాల‌తో ఈ చైనీస్ యానిమేష‌న్ మూవీ రూపొందింది.
వ‌ర‌ల్డ్ వైడ్‌గా యానిమేష‌న్ సినిమాల్లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రికార్డు కూడా నేఝా 2 పేరిటే న‌మోదు అయ్యింది. గ‌త ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో నేఝా 2 టాప్ ప్లేస్‌లో ఉండ‌గా...మ‌రో యానిమేష‌న్ మూవీ జూటోపియా 2 సెకండ్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది.

 

Advertisement
Advertisement