త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hollywood | హాలీవుడ్ ప్ర‌ముఖుల ఆందోళ‌న‌.. పారామౌంట్‌-వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ డీల్స్‌పై బ‌హిరంగ లేఖ‌..!

Hollywood | హాలీవుడ్‌లో ఓ వివాదం తెర‌పైకి వ‌చ్చింది. జోక్విన్ ఫీనిక్స్, బెన్ స్టిల్లర్, క్రిస్టెన్ స్టీవర్ట్ సహా 1,000 మందికిపైగా ప్రముఖ నటులు, దర్శకులు బ‌హిరంగ లేఖ‌పై సంత‌కాలు చేసి పారామౌంట్–స్కైడాన్స్ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు. ‘వారైటీ’ కథనం ప్రకారం ఆ లేఖలో.. “ఈ ఒప్పందంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

P

Entertainment | Published On Apr 14, 2026, 7.41 am IST

Hollywood | హాలీవుడ్ ప్ర‌ముఖుల ఆందోళ‌న‌.. పారామౌంట్‌-వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ డీల్స్‌పై బ‌హిరంగ లేఖ‌..!
Advertisement

Hollywood | హాలీవుడ్‌లో ఓ వివాదం తెర‌పైకి వ‌చ్చింది. జోక్విన్ ఫీనిక్స్, బెన్ స్టిల్లర్, క్రిస్టెన్ స్టీవర్ట్ సహా 1,000 మందికిపైగా ప్రముఖ నటులు, దర్శకులు బ‌హిరంగ లేఖ‌పై సంత‌కాలు చేసి పారామౌంట్–స్కైడాన్స్ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు. ‘వారైటీ’ కథనం ప్రకారం ఆ లేఖలో.. “ఈ ఒప్పందంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది కేవ‌లం కొంద‌రు వ్య‌క్తుల‌కు మాత్ర‌మే లాభం చేకూరుస్తుంద‌ని.. సినిమా ఇండ‌స్ట్రీలో సాధారణంగా పనిచేసే వారికి ఇది ప్రయోజనాన్నిక‌లిగించ‌ద‌న్నారు. అంతేకాకుండా ఇండ‌స్ట్రీని ప్ర‌మాదంలోకి నెడుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రతి రంగం అభివృద్ధి చెందాలంటే న్యాయమైన పోటీ వాతావరణం అవసర‌మ‌ని, అలాగే సరైన నియమాలు, వాటి అమలు కూడా కీల‌క‌మ‌ని పేర్కొన్నారు.

పారామౌంట్ స్కైడాన్స్ సీఈఓ డేవిడ్ ఎల్లిసన్ నేతృత్వంలోని సంస్థ.. ఫిబ్రవరి చివరలో నెట్‌ఫ్లిక్స్‌తో ఆస్తుల విషయంలో పోటీ పడిన తర్వాత, డేవిడ్ జాస్లావ్‌కు చెందిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని 111 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా హాలీవుడ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వెయ్యికి పైగా నటులు, దర్శకులు ఓపెన్ లేఖపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాన్ని వ్య‌తిరేకిస్తున్న ప్రముఖుల్లో ఆడమ్ మెకే, అలన్ కమింగ్, అలిస్సా మిలానో, బూట్స్ రైలీ, బ్రయాన్ క్రాన్స్టన్, సింథియా నిక్సన్, డామన్ లిండెలాఫ్, డేవిడ్ ఫించర్, డెనిస్ విల్నెవ్, ఎలియట్ పేజ్, గ్లెన్ క్లోజ్, జేన్ ఫోండా, జేజే అబ్రమ్స్, జేసన్ బేట్మన్, జాన్ లెగుయిజామో, లిన్-మాన్యుయెల్ మిరాండా, మార్గరెట్ చో, మార్క్ రఫాలో, నోయా వైల్, పాటి లుపోన్, రామీ యూసెఫ్, రొసారియో డాసన్, రోజీ ఓ’డోనెల్, టెడ్ డాన్సన్, టిఫనీ హాడిష్, టిగ్ నోటారో, యోర్గోస్ లాంతిమోస్, యివెట్ నికోల్ బ్రౌన్ వంటి వారున్నారు.

ఈ విలీన ఒప్పందం అమలైతే సినిమాలు.. టీవీ షోలు సంఖ్య తగ్గిపోవచ్చని హాలీవుడ్ కళాకారులు భావిస్తున్నారు. ఫలితంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోత వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు పెద్ద స్టూడియోలు ఒకే సంస్థ ఆధీనంలోకి వస్తే వాణిజ్య పరంగా స్వతంత్రంగా నడిచినా, భవిష్యత్తులో వేలాది మంది జీవనోపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement