త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srisailam Walk Route Map 2026 | శ్రీశైల మహాక్షేత్రానికి కాలినడకన వెళ్తున్నారా? అటవీ మార్గం రూట్ మ్యాప్, పూర్తి వివరాలు ఇవే!

శ్రీశైల మహాక్షేత్రానికి అటవీ మార్గం గుండా కాలినడకన వెళ్లే భక్తుల కోసం 2026 ఫిబ్రవరి 8 నుండి 15 వరకు అనుమతి ఇచ్చారు. ఆత్మకూరు నుండి శ్రీశైలం వరకు ఉన్న పూర్తి రూట్ మ్యాప్ మరియు సౌకర్యాల వివరాలు ఇక్కడ చూడండి.

J

Devotional | Published On Feb 11, 2026, 3.48 pm IST

Srisailam Walk Route Map 2026 | శ్రీశైల మహాక్షేత్రానికి కాలినడకన వెళ్తున్నారా? అటవీ మార్గం రూట్ మ్యాప్, పూర్తి వివరాలు ఇవే!

సంక్షిప్త సారాంశం

శ్రీశైల దేవస్థానం కాలినడక భక్తుల కోసం విడుదల చేసిన అటవీ మార్గ పటం ఇది. ఆత్మకూరు నుండి ప్రారంభమై వెంకటాపురం, నాగులూటి, పెద్దచెరువు మీదుగా శ్రీశైలం చేరుకునే మార్గంలోని కిలోమీటర్ల వివరాలు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన వైద్య, అన్నదాన సౌకర్యాల ఇవే.

Advertisement

Srisailam Walk Route Map 2026 | త్రినేత్ర.న్యూస్: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రానికి వెళ్లడం ప్రతి శివ భక్తుడి జీవితకాల స్వప్నం. మరీ ముఖ్యంగా నల్లమల అడవుల గుండా కాలినడకన వెళ్లే అనుభూతి వర్ణనాతీతం. 2026 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో, అటవీ మార్గం గుండా వెళ్లే భక్తుల కోసం అధికారులు కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇప్పటికే అటవీ మార్గం గుండా వేల సంఖ్యలో భక్తులు నడుచుకుంటూ తరలి వెళ్తున్నారు. ఫిబ్రవరి 15, మహాశివరాత్రి రోజు వరకు అటవీ మార్గం ఓపెన్ ఉంటుంది. ఫిబ్రవరి 16 నుంచి అటవీ మార్గం మూతపడనుంది. ఈనేపథ్యంలో అటవీ మార్గం నుంచి వెళ్లే భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు చేసిన ఏర్పాట్లు ఏంటి? రూట్ మ్యాప్ ఏంటి? అనే విషయాలు తెలుసుకోండి.

అటవీ మార్గంలో ప్రయాణ సమయం

నల్లమల అటవీ మార్గం గుండా కాలినడకన వెళ్లే భక్తులకు 2026 ఫిబ్రవరి 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకంటే ముందు లేదా ఆ తర్వాత అటవీ మార్గంలో ప్రయాణించడం నిషిద్ధం.

ప్రధాన కాలినడక మార్గం - రూట్ మ్యాప్ (ఆత్మకూరు నుండి శ్రీశైలం)

ఆత్మకూరు నుండి శ్రీశైలం వరకు సాగే ఈ పవిత్ర యాత్రలో భక్తులు దాటాల్సిన ప్రధాన ఘట్టాలు, దూరాల వివరాలు

ఆత్మకూరు నుండి వెంకటాపురం: 7 కి.మీ. (రోడ్డు మార్గం)

వెంకటాపురం నుండి గోసాయికట్ల (వీరాంజనేయ స్వామి): 6 కి.మీ. (అడవి మార్గం)

గోసాయికట్ల నుండి నాగులూటి (వీరభద్ర స్వామి ఆలయం): 9 కి.మీ. (అడవి మార్గం)

నాగులూటి నుండి దామెర్లకుంట: 8 కి.మీ. (మెట్ల మార్గం)

దామెర్లకుంట నుండి పెద్దచెరువు (ముజలీ): 2 కి.మీ. (అడవి మార్గం)

పెద్దచెరువు నుండి మరం బావి: 6 కి.మీ. (కొండ మార్గం)

మరం బావి నుండి భీముని కొలను: 3 కి.మీ. (కొండ మార్గం)

భీముని కొలను నుండి కైలాస ద్వారం: 2 కి.మీ. (మెట్ల మార్గం)

కైలాస ద్వారం నుండి శ్రీశైలం: 4 కి.మీ. (రోడ్డు మార్గం)

Srisailam Walk Route Map 2026 Nallamala Forest Path Dates and Facilities Guide

భక్తుల కోసం కల్పించిన సౌకర్యాలు

భక్తుల సౌకర్యార్థం దేవస్థానం, అటవీ శాఖ సమన్వయంతో ప్రధాన కేంద్రాల వద్ద (వెంకటాపురం, గోసాయికట్ల, నాగులూటి, దామెర్లకుంట, పెద్దచెరువు, కైలాస ద్వారం) పలు ఏర్పాట్లు చేశారు.

చలువ పందిళ్లు, తాత్కాలిక విద్యుదీకరణ, మంచినీటి సరఫరా , అన్నదానం, వైద్య శిబిరాలు (Medical Camps), శౌచాలయాల ఏర్పాటు ఉంటుంది.

ప్రతి శివ భక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిన ఈ అటవీ మార్గం, కేవలం యాత్ర మాత్రమే కాదు.. ప్రకృతి ఒడిలో పరమశివుడిని దర్శించుకునే ఒక గొప్ప అనుభూతి.

Advertisement
Advertisement