Simhachalam Chandanotsavam | సింహాచల అప్పన్న నిజరూప దర్శనం..
Simhachalam Chandanotsavam | ఏపీలోని విశాఖపట్నంలో ఉన్న ప్రసిద్ధ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి (Simhachalam Chandanotsavam) వారు భక్తులు నిజరూపంలో దర్శనమిచ్చారు. ఏడాదంతా చందనం పూతతో కొలువుదీరే అప్పన్న స్వామి.. చందనోత్సవం సందర్భంగా గంధపు పొరలు లేకుండా తన అసలు రూపంలో భక్తులకు సాక్షాత్కరించారు.
Devotional | Published On Apr 20, 2026, 10.35 am IST
Simhachalam Chandanotsavam | ఏపీలోని విశాఖపట్నంలో ఉన్న ప్రసిద్ధ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి (Simhachalam Chandanotsavam) వారు భక్తులు నిజరూపంలో దర్శనమిచ్చారు. ఏడాదంతా చందనం పూతతో కొలువుదీరే అప్పన్న స్వామి (Simhadri Appanna).. పవిత్ర చందనోత్సవం సందర్భంగా గంధపు పొరలు లేకుండా తన అసలు రూపంలో భక్తులకు సాక్షాత్కరించారు. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే చందనోత్సవం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం వేకువజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో అప్పన్నను మేల్కొలిపి ప్రత్యేక పూజలు చేశారు. ఒటి గంట నుంచి 3 గంటల వరకు శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు, స్వామి దేహంపై నుంచి చందనం ఒలుపు క్రతువు నిర్వహించారు. స్వామి దేహంపై ఉన్న చందనాన్ని తొలగించి నిజరూపంలోకి తీసుకొచ్చారు.

అనంతరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అశోక గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు సింహాచల అప్పన తొలి దర్శనం చేసుకున్నారు. ఉదయం 3.30 గంటలకు సామాన్య భక్తులను దర్శనాల కోసం క్యూలైన్లలోకి అనుమతించారు. రాత్రి వరకు దర్శనాలు కొనసాగనున్నాయి. ఏడాదికి ఒక్క రోజుమాత్రమే లభించే వరాహ లక్ష్మీ నారసింహ స్వామి నిజరూప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. రాత్రి 7 గంటలకు క్యూలైన్లను మూసివేయనున్నారు.

భక్త ప్రహ్లాదుడిచే ఆలయ నిర్మాణం..
సింహాచలం క్షేత్ర స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని భక్త ప్రహ్లాదుడు నిర్మించినట్లుగా తెలుస్తున్నది. కలియుగానికి వచ్చేసరికి ప్రహ్లాదుడు నిర్మించిన ఆలయం కాలగర్భంలో కలిసిపోయి వరాహ నరసింహుడు పుట్టలోనే ఉండిపోయాడ! కొన్నాళ్లకు పురూరవ చక్రవర్తికి స్వామి స్వప్నంలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించగా చక్రవర్తి పుట్టను తొలగించి ఆలయాన్ని నిర్మించినట్లుగా సింహాచల క్షేత్ర మహత్యంలో వివరించి ఉంది.

చందనోత్సవం..
స్వామి వారిని ఏడాది పొడవునా చందన ముద్దతో కప్పబడిన లింగ రూపంలోనే భక్తులు దర్శించుకుంటారు. అయితే అక్షయ తృతీయ నాడు నిర్వహించే చందనోత్సవం అత్యంత విశిష్టమైనది. సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా అక్షయ తృతీయ రోజు 12 గంటల నిజరూప దర్శనం తరువాత తొలి విడత చందన సమర్పణ జరుగుతుంది. వైశాఖ శుద్ధ పౌర్ణమికి రెండో విడత చందన సమర్పణ ఉంటుంది. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమికి మూడో విడత చందన సమర్పణ ఉంటుంది. ఆషాడ పౌర్ణమికి నాలుగో విడత చందనం సమర్పణ ఉంటుంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






