Ratnachal Express | రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు ఎల్‌హెచ్‌బీ బోగీలు..!
Ratnachal Express | విజయవాడ–విశాఖపట్నం మధ్య ప్రతిరోజూ నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి.
Andhra pradesh | Published On Feb 23, 2026, 9.15 pm IST
Ratnachal Express | విజయవాడ–విశాఖపట్నం మధ్య ప్రతిరోజూ నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత భద్రత, సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రైలుకు ఐసీఎఫ్ కోచ్‌లు వినియోగిస్తుంది.
వాటి స్థానంలో ఆధునిక సదుపాయాలతో కూడిన ఎల్‌హెచ్‌బీ (లింక్ హాఫ్‌మన్ బుష్) కోచ్‌లను అమర్చనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఎల్‌హెచ్‌బీ బోగీలు భద్రతాపరంగా మెరుగ్గా ఉంటాయి. వేగానికి అనుకూలంగా ఉండటంతో పాటు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. రేపటి నుంచి ఈ కొత్త కోచ్ వ్యవస్థ అమలులోకి రానున్నందున, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారంతా కోచ్‌ల మార్పును గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. ఇక ఇప్పటి వరకు రైలులో 24 బోగీలు ఉన్నాయి.
అందులో 18 చైర్ కార్లు, మూడు ఏసీ చైర్ కార్లు, ఒక ప్యాంట్రీ కార్, 2 సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ దివ్యాంగుల కోచ్‌లు ఉన్నాయి. మార్పుల తర్వాత మొత్తం బోగీల సంఖ్య 22కి తగ్గనుంది. కొత్త కూర్పులో 12 చైర్ కార్లు, 3 థర్డ్ ఏసీ చైర్ కార్స్, ఒక ప్యాంట్రీ కార్, నాలుగు జనరల్ కోచ్‌లు, రెండు సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ దివ్యాంగుల బోగీలు ఉండనున్నాయి. అంటే ఇప్పటివరకు ఉన్న 18 చైర్ కార్ల స్థానంలో ఇకపై 12 మాత్రమే ఉంటాయి. వాటి బదులుగా 4 జనరల్ కోచ్‌లను చేర్చింది. సాధారణ ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించనున్నది. అయితే, మొత్తం కోచుల్లో రెండు తగ్గనున్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





