త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadagirigutta | వ‌ట‌ప‌త్ర‌శాయిగా యాద‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహుడు..!

Yadagirigutta | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్ర‌ప‌ర్వంగా సాగుతున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా శ‌నివారం ప్ర‌ధాన ఆల‌యంలో వేకువజామున ద్వారతోరణ పూజ, ధ్వజకుంటారాధన, అగ్ని ఆరాధన, మూల మంత్ర, పంచసూక్త హవనం, నిత్యపూర్ణాహుతిని త‌దిత‌ర పూజలు, ఆలయ ప్రధానార్చకులు, యాజ్ఞికులు, రుత్వికులు, పారాయణందారులు, అర్చకబృందం నిర్వ‌హించారు.

P

Devotional | Published On Feb 21, 2026, 7.20 pm IST

Yadagirigutta | వ‌ట‌ప‌త్ర‌శాయిగా యాద‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహుడు..!
Advertisement

Yadagirigutta | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్ర‌ప‌ర్వంగా సాగుతున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా శ‌నివారం ప్ర‌ధాన ఆల‌యంలో వేకువజామున ద్వారతోరణ పూజ, ధ్వజకుంటారాధన, అగ్ని ఆరాధన, మూల మంత్ర, పంచసూక్త హవనం, నిత్యపూర్ణాహుతిని త‌దిత‌ర పూజలు, ఆలయ ప్రధానార్చకులు, యాజ్ఞికులు, రుత్వికులు, పారాయణందారులు, అర్చకబృందం నిర్వ‌హించారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీస్వామివారిని వంటపత్రశాయి అలంకారంలో ప్రత్యేక పల్లకీపై వేంచేపు చేసి పూజ‌లు చేశారు. అనంత‌రం మేళతాళాల మ‌ధ్య శ్రీస్వామివారి స్వామివారిని తిరుమాడవీధుల్లో ఊరేగించారు. పశ్చిమ రాజగోపురం నుంచి తిరుమాడవీధుల్లోకి ప్రవేశించిన సేవ ఉత్తర, తూర్పు దక్షిణ తిరుమాడవీధుల్లోకి ఊరేగి తిరిగి పశ్చిమ గుండా ఆలయంలోకి ప్రవేశించగా భక్తులు స్వామివారి ద‌ర్శించుకొని త‌రించారు.

అంతకుముందే స్వామివారిని తూర్పు మాడవీధుల్లో ప్రత్యేక వేంచేపు మండపంలో ఆస్థానం చేసి ప్రధానార్చకులు వటపత్రశాయి విశిష్టతను భక్తుల వినిపించారు. 'కరార విందేనపదారవిందం.. పదారవిందేనముకేశయానం.. చటస్య పత్రస్య సుఖేశయానం.. బాల ముకుందం మనసాస్మరామీ.' అని మహాభాగవతంతో వటపత్రశాయి గురించి విశిష్టంగా చెప్పడం జరిగిందని ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు. పూర్వం ప్రళయాంత కాలంలో స్వామి సృష్టిని తిరుగోమనం చేయడం కోసం సంకల్పించినప్పుడు మహా ప్రళయాంత కాలంలో స్వామి 14 లోకాలను చిన్న నిష్కమాత్ర ప్రమాణం ద్వారా గర్భంలో నిష్కిప్తం చేసుకుని మర్రి ఆకుపై పవళించినటువంటి దృశ్యమే వటపత్రశాయి అని వివరించారు. ఇది కేవలం ఒక మార్కండేయ మహర్షి మాత్రమే దర్శించారు. దేవతలకు కూడా ఇది అవగ్నమనస గోచరమైనటువంటి రూపకల్పం. అలాంటి అపురూపమైన రూపదర్శనాన్ని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవ వేడుకల్లో ఉదయం వటపత్రాశాయిగా స్వామివారిని అలంకరింపజేశారని అన్నారు.

హంసవాహనంలో ఊరేగిన యాదాద్రీశుడు

రాత్రి స‌మ‌యంలో స్వామివారు హంస దివ్యవాహనంపై భక్తజనులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు నిత్యకైంకర్యాల అనంతరం నారసింహస్వామివారిని ప్రధానాలయంలోని కల్యాణ మండపంలో హంస వాహనంపై అదిష్టింపజేసి ప్రధానాలయ తిరుమాడవీధుల్లో ఊరేగించారు. హంస వేదస్వరూపం, జ్ఞానాత్మకమైన వేద ప్రాముఖ్యంగా ఉన్న హంస వాహన సేవను ఆగమశాస్త్రరీతిలో ఆలయ ప్రధానార్చకులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భవానిశంకర్, కలెక్టర్ హనుమంతరావు, డీఈవో దోర్బాల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బ‌ట్టార్‌ సురేంద్రాచార్యులు, ఉప ప్రధానార్చకులు, సహయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement