Kurtis | 4 కుర్తీలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది.. రూ.98వేలు పోగొట్టుకుంది..
Kurtis | ముంబైలో ఓ మహిళ ఆన్‌లైన్‌లో కుర్తీలు కొనుగోలు చేసిన తర్వాత సైబర్ మోసానికి గురై రూ.98వేలు నష్టపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె చేసిన చెల్లింపు పూర్తి కాలేదని చెప్పి మోసగాళ్లు తప్పుడు రీఫండ్ ప్రక్రియతో ఆమెను తప్పుదారి పట్టించారు. దీంతో ఆమె డబ్బు నష్టపోయింది.
Kurtis | ముంబైలో ఓ మహిళ ఆన్‌లైన్‌లో కుర్తీలు కొనుగోలు చేసిన తర్వాత సైబర్ మోసానికి గురై రూ.98వేలు నష్టపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె చేసిన చెల్లింపు పూర్తి కాలేదని చెప్పి మోసగాళ్లు తప్పుడు రీఫండ్ ప్రక్రియతో ఆమెను తప్పుదారి పట్టించారు. దీంతో ఆమె డబ్బు నష్టపోయింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ ఇటీవల Westside.com అనే వెబ్‌సైట్ ద్వారా నాలుగు కుర్తీలు ఆర్డర్ చేసి, కొనుగోలు సమయంలోనే పూర్తి మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించింది. కొనుగోలు చేసిన కొద్దిసేపటికే ఆమెకు సైబర్ మోసగాళ్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. వారు ఆమె ముందుగా చేసిన చెల్లింపు సరిగా పూర్తికాలేదని, సాంకేతిక సమస్య ఏర్పడిందని చెప్పి, మళ్లీ చెల్లింపు చేయాలని సూచించారు.
పలు దఫాల్లో చెల్లింపులు..
అదనంగా డెబిట్ అయిన మొత్తం మొత్తాన్ని రీఫండ్ ప్రక్రియ ద్వారా తిరిగి ఇస్తామని వారు హామీ ఇచ్చారు. వారి మాటలు నమ్మిన ఆ మహిళ రీఫండ్ ప్రక్రియ ప్రారంభించేందుకు రూ.2,647 మరోసారి చెల్లించింది. మోసగాళ్లు సూచించిన విధంగా ఆమె అలా పలు దఫాల్లో విడతలవారిగా చెల్లింపులు చేసింది. దీంతో ఆ లావాదేవీల మొత్తం రూ.98వేలు అయింది. అయితే తన ఖాతా నుంచి అంత పెద్ద ఎత్తున డబ్బులు ఖాళీ అవడంతో ఆమెకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది. వారు సైబర్ నేరగాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అధికారిక వెబ్‌సైట్లనే ఉపయోగించాలి: పోలీసులు
ప్రజలు ఎల్లప్పుడూ అధికారిక షాపింగ్ వెబ్‌సైట్‌లలోనే కొనుగోళ్లు చేయాలని, తెలియని వెబ్‌సైట్‌లలో కొనుగోళ్లు చేయవద్దని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు. ఏ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ప్రతినిధులు కూడా పేమెంట్ చేయాలని కాల్ చేయరని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. అలాగే ఆన్‌లైన్‌లో కస్టమర్ కేర్ నంబర్లను ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్ల నుంచే పొందాలని, ఇతర సైట్లలో తీసుకుని కాల్స్ చేస్తే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



