Reels | రీల్స్ పిచ్చి.. ఉరేసుకునే సీన్ రికార్డు చేస్తూ.. ప్రాణాలు కోల్పోయిన మహిళ
Reels | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రీల్స్ పిచ్చి మహిళ ప్రాణం తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఓ మహిళ (UP woman) రీల్స్ చిత్రీకరిస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది (woman loses her life While Filming Reel).
Reels | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రీల్స్ పిచ్చి మహిళ ప్రాణం తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఓ మహిళ (UP woman) రీల్స్ చిత్రీకరిస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది (woman loses her life While Filming Reel). ఈ ఘటన బందా (Banda) జిల్లాలో తాజాగా చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. జిల్లాకు చెందిన మోహిని అనే 27 ఏళ్ల మహిళకు రీల్స్ అంటే పిచ్చి. నిత్యం ఏదో ఒక రీల్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇటీవలే ఆమె ఉరేసుకునే సీన్‌తో రీల్ చేయాలని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరితాడు సిద్ధం చేసింది. రీల్ చేసేందుకు స్టూల్‌పైకి ఎక్కి ఆ తాడును గొంతుకు వేసుకుంది. ఆ తర్వాత వీడియో తీసేందుకు ప్రయత్నిస్తూ.. ఒక్కసారిగా పట్టుకోల్పోయింది. ఇంకేముందు.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
మోహిని నాలుగేళ్ల కుమార్తె గదిలోకి వెళ్లి చూడగా.. తల్లి వేలాడుతూ కనిపించింది. దీంతో ఆ చిన్నారి భయంతో గట్టిగా కేకలు వేసింది. ఏమైందా అని ఇరుగుపొరుగువారు వచ్చి చూడగా మోహిని ఉరేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆ పక్కనే స్టూల్, ఫోన్ ఉండటాన్ని గమనించారు. రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు తెలుసుకుని వారు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఇది రీల్ చిత్రీకరిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంగా పోలీసులు తేల్చారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






