online games | ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఉసురు తీసిన ఆన్‌లైన్ గేమ్స్.. తొమ్మిదో అంతస్తు నుంచి దూకి
online games | ఘజియాబాద్‌లో ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలైన ముగ్గురు అక్కాచెల్లెల్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
online games | ప్రస్తుతం పిల్లలు చదువుల కంటే ఆన్‌లైన్ గేమ్స్ (online games)కే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ సమయం పిల్లల భవిష్యత్తును పూర్తిగా దెబ్బతీసింది. అప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండటంతో ఆన్‌లైన్ గేమ్స్‌కు ఎక్కువగా అలవాడు పడ్డారు. చదువులు పక్కన పెట్టి మరీ వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదయం లేచింది మొదలు ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినడం లేదు. గట్టిగా మందలిస్తే.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూశాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్‌లో ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలైన ముగ్గురు అక్కాచెల్లెల్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు నివసిస్తున్న బిల్డింగ్ తొమ్మిదో అంతస్తు పై నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఘజియాబాద్ (Ghaziabad)లోని భారత్ సిటీలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న విషిక (16), ప్రాచీ (14), పాఖీ (12) చురుకైన పిల్లలు. ఇంట్లో అమ్మకు సాయం చేస్తూనే.. చదువుల్లోనూ మంచిగా రాణించేవారు. ఖాళీ సమయంలో తల్లిదండ్రులతో సరదాగా సమయం గడిపేవారు. అయితే కరోనా మహమ్మారి వారి జీవితాలనే మార్చేసింది. లాక్‌డౌన్ సమయంలో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డారు. ఓ కొరియన్ టాస్క్-బేస్డ్ ఆన్‌లైన్ గేమ్‌కు అలవాటు పడ్డారు. అప్పటి నుంచి ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ ఫోన్‌లో గేమ్స్ ఆడుతూనే ఉంటున్నారు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినడం లేదు. ఇంట్లో వాళ్లతో ఎలాంటి సంబంధం లేదు అన్నట్లు గేమ్‌లోనే మునిగిపోయేవారు. ఇది చూసి విసుగు చెందిన తల్లిదండ్రులు.. ముగ్గురినీ తీవ్రంగా మందలించారు.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ అక్కాచెల్లెళ్లు.. కఠిన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అంతా నిద్రిస్తున్న సమయంలో బిల్డింగ్‌పైకి ఎక్కి తొమ్మిదో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నారు. ముగ్గురూ ఒకేసారి కిందకు దూకడంతో శబ్ధం వచ్చింది. ఆ శబ్దానికి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి చూడగా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు రక్తపు మడుగుల్లో పడి కనిపించారు. వారిని చూసిన సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పిల్లల్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు చెప్పడంతో కుప్పకూలిపోయారు.
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరు తల్లిదండ్రులు మందలించినందుకే ఆత్మహత్య చేసుకున్నారా..? లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వారు వాడిని మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరోవైపు ఆన్‌లైన్ గేమ్స్‌ను బ్యాన్ చేయాలంటూ తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






