Cash On Delivery Scam | పెరిగిపోతున్న క్యాష్ ఆన్ డెలివరీ (COD) మోసాలు.. నకిలీ పార్సిళ్లను పంపిస్తూ స్కామ్..
Cash On Delivery Scam | క్యాష్ ఆన్ డెలివరీ (COD) పద్ధతిని ఒకప్పుడు ఎంతో సురక్షితమైందిగా, సౌకర్యవంతమైన చెల్లింపు విధానంగా భావించేవారు. కానీ ఇప్పుడు అది మోసగాళ్లకు వరంగా మారుతోంది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని పలు రకాలుగా సేకరించి వారు ఆర్డర్ చేయకపోయినా పార్సిళ్లను పంపిస్తూ క్యాష్ ఆన్ డెలివరీ మోసాలకు పాల్పడుతున్నారు.
Cash On Delivery Scam | క్యాష్ ఆన్ డెలివరీ (COD) పద్ధతిని ఒకప్పుడు ఎంతో సురక్షితమైందిగా, సౌకర్యవంతమైన చెల్లింపు విధానంగా భావించేవారు. కానీ ఇప్పుడు అది మోసగాళ్లకు వరంగా మారుతోంది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని పలు రకాలుగా సేకరించి వారు ఆర్డర్ చేయకపోయినా పార్సిళ్లను పంపిస్తూ క్యాష్ ఆన్ డెలివరీ మోసాలకు పాల్పడుతున్నారు. తమకు డెలివరీగా వచ్చిన పార్సిల్ తమదేనా, కాదా అనే అయోమయంలోనే చాలా మంది ఆ పార్సిల్స్‌కు డబ్బులు చెల్లిస్తూ మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ప్రస్తుతం అనేక చోట్ల క్యాష్ ఆన్ డెలివరీ మోసాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డేటా లీక్ ద్వారా సమాచారం సేకరణ..
సైబర్ నేరగాళ్లు డేటా లీకులు, పబ్లిక్ డేటాబేస్‌లు, లీకైన సెల్లర్ అకౌంట్ల ద్వారా వినియోగదారులకు చెందిన పేరు, ఫోన్ నంబర్, చిరునామా వంటి వివరాలను సేకరిస్తున్నారు. అనంతరం వినియోగదారులు ఆర్డర్ చేయకపోయినా వారి పేరిట క్యాష్ ఆన్ డెలివరీ పార్సిల్స్‌ను పంపిస్తున్నారు. ఈ క్రమంలో డెలివరీ సమయంలో వినియోగదారులు తాము ఆ ఆర్డర్‌ను బుక్ చేశామా, లేదా అని ఆలోచించుకుంటూ గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు డెలివరీ ఏజెంట్లు సైతం తమకు వేరే డెలివరీలు ఉన్నాయని త్వరపెడుతారు. దీంతో అయోమయానికి గురయ్యే వినియోగదారులు ఆ పార్సిల్‌కు డబ్బులు చెల్లించి తీసుకుంటున్నారు. తీరా ఓపెన్ చేసి చూస్తే అందులో రాళ్లు, ఇటుకలు వంటి వస్తువులు ఉంటున్నాయి. అయితే అప్పటికే డబ్బులు చెల్లించి ఉంటారు కనుక మోసం జరిగినట్లు గుర్తించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా మోసాలు అధికంగా జరుగుతున్నాయి.
కొరియర్ సంస్థకు, డెలివరీ వ్యక్తులకు తెలియదు..
మోసగాళ్లు వినియోగదారుల సమాచారంతో వారు ఆర్డర్ చేయకపోయినా వారికి పార్సిల్స్‌ను పంపిస్తూ క్యాస్ ఆన్ డెలివరీ పద్ధతిలో డబ్బులు కాజేస్తున్నారు. కొరియర్ సంస్థలకు, అందులో పనిచేసే డెలివరీ ఏజెంట్లకు ఈ విషయం తెలియడం లేదు. వారికి ఆర్డర్‌ను డెలివరీ చేయడమే పని. అందులో ఏముంది.. అన్నది వారికి అవసరం లేదు. దీంతో మోసగాళ్లకు ఇది ఆదనుగా మారింది. కొరియర్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ పార్సిల్స్‌ను పంపిస్తూ డబ్బులు కొట్టేస్తున్నారు. డెలివరీ ఏజెంట్ డబ్బులు తీసుకున్న తరువాత ఆ మొత్తాన్ని కంపెనీ ప్రాసెస్ చేస్తుంది. ఆ తరువాత ఆ మోసగాళ్లకు బదిలీ చేస్తుంది. అయితే వారు ఇలా మోసం చేస్తున్నారని కూడా కొరియర్ సంస్థలకు తెలియదు. వారు వస్తువులను డెలివరీ చేస్తున్నామనే భావిస్తున్నారు. దీంతో ఈ విధానం ద్వారా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో వారు వినియోగదారులకు కాల్స్, మెసేజ్‌లు సైతం చేస్తూ ఆ పార్సిల్ నిజంగా వచ్చింది అంటూ నమ్మించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు.
సీవోడీ అయితే గుర్తించలేరనే..
సాధారణంగా డిజిటల్ చెల్లింపులు అయితే చార్జ్ బ్యాక్, ధ్రువీకరణ, ఫ్రాడ్ డిటెక్షన్ వంటివి ఉంటాయి. కనుక మోసం చేయడం అసాధ్యం. సీవోడీ చెల్లింపుల్లో ఇలాంటి ఆంక్షలు ఉండవు. వినియోగదారుడు ఇంటి వద్ద నగదు ఇస్తాడు. తరువాత దాన్ని కొరియర్ సంస్థ మోసగాడికి చేరవేస్తుంది. ఈ పద్ధతిలో ఒక్కసారి డబ్బు వినియోగదారుడి చేతి నుంచి మోసగాడి చేతికి చేరితే దాన్ని రికవరీ చేయడం కూడా కష్టమే. ఇక డెలివరీ సమయంలో ఏజెంట్ ఎదురుగా నిలబడి ఉంటాడు కనుక చాలా మంది హడావిడిలో వివరాలు చెక్ చేయకుండా తొందరపడి చెల్లింపులు చేస్తుంటారు. ఇదే మోసగాళ్లకు వరంగా మారింది. అందుకనే వారు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
జాగ్రత్తగా ఉండాల్సిందే..
తరచూ ఆన్ లైన్ ద్వారా ఆర్డర్లు చేసే వారు, రోజూ పార్సిల్స్ వచ్చే చిన్న వ్యాపారులు ఎక్కువగా ఈ సీవోడీ మోసాలకు గురవున్నట్లు తేలింది. ఇల్లు లేదా ఆఫీస్ ఎక్కడైనా సరే పార్సిల్ వస్తే పేరు ఉంటుంది కనుక తమ వారు ఎవరో ఆర్డర్ చేసి ఉంటారని సాధారణంగా చాలా మంది వెరిఫై చేయకుండానే డబ్బు చెల్లించి పార్సిల్ తీసుకుంటారు. దీన్నే నేరగాళ్లు అదనుగా భావించి ఈ స్కాంలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సీవోడీ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా సీవోడీ పార్సిల్ వస్తే కచ్చితంగా వెరిఫై చేసుకోవాలని, ఒక వేళ పొరపాటున డబ్బులు చెల్లించినా కూడా కొరియర్ సంస్థకు చెందిన కస్టమర్ సర్వీస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పి ఫిర్యాదు చేయాలని, దీంతో మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Amazon Now | హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. అమెజాన్‌లో ఇక నిమిషాల్లోనే వస్తువుల డెలివరీ..
మే 2, 2026

Instagram | కొత్త పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టనున్న ఇన్స్టాగ్రామ్.. నెలకు రుసుము ఎంతంటే..?
మార్చి 31, 2026

Bengaluru Family Attempts to Courier Man | ఇన్‌స్టా రీల్ కోసం కన్నతండ్రిని గోనె సంచిలో వేసి కోరియర్ చేయిబోయిన యువతి
మార్చి 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



