Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Road Accident | కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది.
Road Accident | కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బెంగళూరు (Bengaluru) సమీపంలో శుక్రవారం ఉదయం పలు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
హోస్కోట్-డోబ్స్‌పేట్ (Hoskote–Dabaspete) హైవేలోని ఎం సత్యవర (Sathyawara) గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హోస్కోట్ నుంచి దేవనహళ్లి వైపు వెళ్తున్న ఎస్‌యూవీ వాహనం తొలుత ఓ బైక్‌ను ఢీ కొట్టింది. అనంతరం డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఓ ట్రక్కును, మరో కారును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఎస్‌యూవీ కారు పూర్తి నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో బైకర్, ఎస్‌యూవీలోని ఆరుగురు.. మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
https://x.com/PTI_News/status/2022154129750323283
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






