త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Boy Drowns in Water pool | ఫోటోషూట్‌లో తల్లి బిజీ.. స్విమ్మింగ్ పూల్‌లో పడి కొడుకు మృతి

చిన్న పిల్లలను బయటికి తీసుకొచ్చినప్పుడు ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయొద్దని, వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

J

Crime | Published On Feb 16, 2026, 3.34 pm IST

Boy Drowns in Water pool | ఫోటోషూట్‌లో తల్లి బిజీ.. స్విమ్మింగ్ పూల్‌లో పడి కొడుకు మృతి
Advertisement

Boy Drowns in Water pool | సోషల్ మీడియా వచ్చుడేందో కానీ జనాలు చుట్టు పక్కన ఏం జరుగుతుందో కూడా మరిచిపోతున్నారు. సోషల్ మీడియాలో లైక్స్, షేర్స్ కోసం సెల్ఫీలు, ఫోటోషూట్స్ దిగడం వాటిని అందులో పోస్ట్ చేయడం ఇదే జీవితంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. చివరకు సొంత వాళ్లను కూడా పట్టించుకోకుండా సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. తాజాగా ఓ తల్లి ఫోటోషూట్‌లో బిజీ అయి తన సొంత కొడుకునే మైమరిచింది. దీంతో ఆ కొడుకు పక్కనే ఉన్న వాటర్ పూల్‌లో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

చరణ్, స్వాతి దంపతుల కొడుకు లక్ష్మీర్. వయసు 3 ఏళ్లు. స్వాతి ప్రస్తుతం ఎనిమిదేళ్ల గర్భిణీ. చాలామందికి ప్రెగ్నెంట్‌గా ఉన్న టైమ్‌లో ఫోటోషూట్స్ తీసుకోవడం అలవాటు. దాన్ని ఒక మెమోరీగా జీవితాంతం గుర్తుంచుకుంటారు. స్వాతి కూడా అలాగే అనుకుంది కానీ.. నిజంగానే అది చెరిగిపోని మెమోరీ అవుతుందని ఊహించలేదు. తన కొడుకును పక్కన ఉంచి ఫోటోషూట్ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటోంది. దీంతో లక్ష్మీర్ అక్కడే అడుకుంటున్నాడు. మెల్లగా పక్కనే ఉన్న వాటర్ పూల్ దగ్గరికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. దీంతో అందులో మునిగి చనిపోయాడు.

తన కొడుకు ఎక్కడ అని అటూ ఇటూ వెతికిన స్వాతికి పూల్‌లో విగత జీవుడిగా లక్ష్మీర్ కనిపించడంతో కన్నీరు మున్నీరు అయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. స్వాతి భర్త చరణ్ విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా.. స్వాతి తన కొడుకుతో బెంగళూరులో ఉంటోంది. మరో బిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆ దంపతులకు లక్ష్మీర్ మరణంతో తట్టుకోలేకపోతున్నారు. తన అజాగ్రత్త వల్ల కళ్ల ముందే కొడుకు పూల్‌లో మునిగినా చూడలేకపోవడం వల్ల ఇంత దారుణం జరగడంతో స్వాతి తట్టుకోలేకపోయింది. స్వాతి భర్త కూడా ఈ ఘటన గురించి తెలియగానే వెంటనే బెంగళూరుకి బయలుదేరినట్లు తెలుస్తోంది.

చిన్న పిల్లలను బయటికి తీసుకొచ్చినప్పుడు ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయొద్దని, వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement