WPL 2026 | యూపీ వారియర్స్‌ను మళ్లీ ఓడించిన గుజరాత్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి..
WPL 2026 | వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026లో గుజరాత్ జయాంట్స్ మళ్లీ విజయపథంలోకి చేరింది. సోఫీ డివైన్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన (50 పరుగులు, 2 వికెట్లు)తో పాటు రాజేశ్వరి గైక్వాడ్ (3/16) అద్భుతమైన బౌలింగ్ స్పెల్ జట్టుకు భారీ విజయాన్ని అందించాయి.
WPL 2026 | వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026లో గుజరాత్ జయాంట్స్ మళ్లీ విజయపథంలోకి చేరింది. సోఫీ డివైన్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన (50 పరుగులు, 2 వికెట్లు)తో పాటు రాజేశ్వరి గైక్వాడ్ (3/16) అద్భుతమైన బౌలింగ్ స్పెల్ జట్టుకు భారీ విజయాన్ని అందించాయి. వడోదరలో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 45 పరుగుల తేడాతో విజయం సాధించిన గుజరాత్ జెయింట్స్, మెగ్ లానింగ్ నేతృత్వంలోని జట్టును ఈ సీజన్లో రెండోసారి ఓడించడంతోపాటు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జయాంట్స్కు డానియెల్ వైట్-హాడ్జ్ శుభారంభం అందించింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆమె ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మూడు ఫోర్లతో ఆకట్టుకున్నప్పటికీ, కేవలం ఎనిమిది బంతుల్లోనే పెవిలియన్ చేరింది.
ఆ తర్వాత బెత్ మూనీ (38), అనుష్క శర్మ, ఆష్లీ గార్డెనర్, సోఫీ డివైన్లతో కలిసి ఇన్నింగ్స్‌ను స్థిరపరిచింది. అయితే ఈ సీజన్లో ఫామ్ కోల్పోయిన మూనీ, వేగంగా పరుగులు తీయలేక 13వ ఓవర్లో మిడ్ ఆఫ్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటైంది. ఆరంభంలో నాలుగు ఓవర్లలో 38/1 స్కోరు చేసిన జయాంట్స్, మధ్య ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోవడంతో 13వ ఓవర్‌కు 93/4కి చేరింది. డివైన్ మాత్రం ఓర్పుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. చివరి ఓవర్లో రెండు సిక్సర్లతో 16 పరుగులు రాబట్టి తన అర్ధశతకాన్ని పూర్తి చేసిన ఆమె, జట్టును 20 ఓవర్లలో 153/8 కు డిఫెండబుల్ స్కోర్‌కు చేర్చింది. ఇక లక్ష్య చేధనలో యూపీ వారియర్స్ పూర్తిగా తడబడింది. కిరణ్ నవ్‌గిరే మరోసారి డకౌట్‌గా వెనుదిరిగింది. ఆపై మెగ్ లానింగ్, ఫీబీ లిచ్‌ఫీల్డ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఐదవ ఓవర్లో లానింగ్ తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని సరిగ్గా అంచనా వేయలేక స్టంప్ అవడంతో జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
లిచ్‌ఫీల్డ్ మాత్రం ఆకర్షణీయమైన షాట్లతో స్కోరు బోర్డును కదిలిస్తూ జట్టును పోటీలో ఉంచింది. కానీ ఎనిమిదో ఓవర్లో హర్లీన్ డియోల్ రివర్స్ స్వీప్ ఆడుతూ ఔటవ్వడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత రాజేశ్వరి గైక్వాడ్ మధ్య ఓవర్లలో విజృంభించి దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్, ఎస్ ఆశాలను వరుసగా పెవిలియన్‌కు పంపింది. మరోవైపు డివైన్ రెండో స్పెల్‌లో టెయిలెండర్స్‌ను క్లీన్ చేసింది. చివరకు యూపీ వారియర్స్ 17.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






